నీరు లేక అల్లాడుతుంటే ప్లీనరీలా

హైదరాబాద్

 :రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తూంటే ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లీనరీ నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాగేందుకు నీరు లేక గ్రామాల్లో జనాలు అల్లాడుతున్నారన్నారు. గడ్డి లేక పశువులు ఆలమటిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్లీనరీకి రూ. కోట్లు తగలేసే సీఎంని ఒక్క కేసీఆర్‌ను మాత్రమే చూస్తున్నామని ఆయన విమర్శించారు.


ఏదైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో దివంగత నేత కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తున్నప్పుడు ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండడడం సంప్రదాయంగా పేర్కొన్నారు. కానీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనం వృధాగా ఖర్చు చేయటం ఎందుకు సీఎంను ప్రశ్నించారు.

పాలేరు ఎన్నికలకు పెట్టే ఖర్చుతో ఆ జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటి సమస్య, పశువులకు పశుగ్రాసం సమస్య పరిష్కరించవచ్చని చెప్పారు. 15 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 11 వందల మంది బలిదానం చేస్తే.. ఇప్పటి  కేవలం 250 మందికి సహయం చేశారని వివరించారు. డబల్ బెడ్ రూం ఇళ్లు ఒక్క హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదన్నారు. సీఎం మాటల గారడీ ఎంతో కాలం నడవదని ప్రజలు తిరగబడ్డ రోజు పలాయనం చిత్తగించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Back to Top