ప్రజల నడ్డి విరుస్తున్న సర్కారు: బాబూరావు

హైదరాబాద్, 13 జూన్ 2013:

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ధ్వజమెత్తారు. గురువారంనాడాయన అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగాయనీ, ఈ పరిస్థితిని సామాన్యులు తట్టుకోలేకపోతున్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలే శరణ్యమా అన్నట్లుగా  ప్రజలు కాలం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేసుకోవచ్చని బాబురావు చెప్పారు. అమ్మ హస్తం సంచిపై ఫోటోలే తప్ప లోపల సరకులు ఉండటం లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ సరకులున్నా అవి కల్తీ సరుకులేనన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ప్రజా సమస్యలపై శ్రద్ధలేదని బాబురావు మండిపడ్డారు.

Back to Top