వైయస్సార్ కు పేరొస్తుందనే

అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే.. చంద్రబాబు హంద్రీనీవాను పట్టించుకోవడం లేదని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అనంతపురానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైయస్ఆర్ దేనని గుర్తు చేశారు. ఇవాళ అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్లో ఆయన పుష్కర స్నానం చేశారు.

అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఏటా 15 టీఎంసీలు వస్తున్నా బాబు ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top