<br/>హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి.గౌతంరెడ్డి గురువారం హైదరాబాద్లో పలు ప్రశ్నలు సంధించారు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయి జె.మత్తయ్యకు ఎలా ఆశ్రయం ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గౌతంరెడ్డి ప్రశ్నించారు. ఇక్కడి ముద్దాయితో అక్కడ కేసు ఎలా పెట్టిస్తారని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే డీజీపీ రాముడు, సీఎస్ కృష్ణారావు చట్ట పరిధి దాటి ప్రవర్తిస్తారా ? అంటూ సందేహం వ్యక్తం చేశారు.<br/>చంద్రబాబు వ్యక్తిగత విషయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమిటీ సంబంధమన్నారు. టీఆర్ఎస్ విధానానికి అనుగుణంగానే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రమే పోలవరం మొత్తాన్ని నిర్మిస్తామని చెప్పినా చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ కట్టడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రాజెక్ట్లలో కమీషన్లు రావనే దోచుకోవడానికి పట్టిసీమ కడుతున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై గౌతంరెడ్డి నిప్పులు చెరిగారు.