స్వీట్లు తినేందుకు ఢిల్లీ వచ్చారా బాబూ?

ఫొటోలు దిగితే రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు.. దయచేసి నటించొద్దు
మాతో కలిసిరండి పోరాటం చేద్దాం.. హోదా సాధిద్దాం
వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

ఢిల్లీ: లోక్‌సభకు వచ్చి మొక్కుకోవడం, టీలు తాగడం, స్వీట్లు తినడం కాదు.. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చంద్రబాబుకు సూచించారు. 30వ సారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ను మించిన డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు. ఒకరిద్దరు జాతీయ పార్టీ ఎంపీలతో ఫొటోలు దిగితే.. రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, దయచేసి ఇంకా నటించొద్దని, ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో సమావేశమై రాజీనామాలకు సిద్ధపడాలని కోరారు. కేంద్రంపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం.. అందరం కలిసి రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో నిరాహారదీక్షలు చేద్దామన్నారు. హోదాపై చిత్తశుద్ధి లేని టీడీపీ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తుందని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని టార్గెట్‌ చేసి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా పబ్బం గడుపుకుంటారని, ఎప్పటికైనా మీ అసలు రంగు బయటపడుతుందని అప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

Back to Top