- టిఫిన్ కోసం అమెరికాలో తన్నుకున్న పచ్చ తమ్ముళ్లు
- రెండు పచ్చగ్రూపుల మధ్య జరిగిన ఘర్షణను వైయస్‌ఆర్ సీపీకి అంటగడుతున్న టీడీపీ
- చంద్రబాబు చందాల వసూళ్లలో జరిగిన గొడవ
- ఏపీలోనే ప్రజాధరణ లేని వ్యక్తికి అమెరికాలో ఉందనడం సిగ్గుచేటు
- బాబుకు కట్టప్ప క్యారెక్టరే పర్‌ఫెక్ట్
- వైయస్‌ఆర్ సీపీ చంద్రబాబును పట్టించుకోవడమే మానేసింది
- వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి
నెల్లూరు: టిఫిన్ విషయంలో అమెరికాలో తెలుగు తమ్ముళ్ల మధ్య జరిగిన ఘర్షణను కప్పిపుచ్చుకోవడానికి... వైయస్‌ఆర్ సీపీకి చెందినవారు ఈమెయిల్స్ పంపించారని వ్యవసాయ మంత్రి సోదిరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లి వరద ప్రవాహంలా ఏపీ అభివృద్ధికి నిధులు తెస్తుంటే వైయస్‌ఆర్ సీపీ అడ్డుకుంటుందని సోమిరెడ్డి అనడాన్ని కాకాణి తప్పుబట్టారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం వల్ల ప్రమోషన్లు వస్తున్నాయని సోదిరెడ్డికి అలవాటైపోయిందన్నారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎవరు, ఎక్కడికి, ఏమని మెయిల్స్ పంపించారో.. వాటిపై స్పష్టత ఇచ్చే దమ్ము, ధైర్యం మీకుందా అని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. చందాలు వసూలు చేసుకోవడానికి, అక్కడున్న మీవాళ్లతో లావాదేవీలు మాట్లాడుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్లింది వాస్తవమా.. కాదా అని నిలదీశారు. చంద్రబాబుతో టిఫిన్ చేయడానికి 200 డాలర్లకు టిక్కెట్ పెట్టారని, అమెరికాలోని కొందరు టీడీపీ నేతలు మేం పాటిస్పేట్ చేయమని చెప్పితే.. రావాల్సిందేనని బలవంతంగా టికెట్ అంటగట్టే ప్రయత్నం చేస్తే ఆ రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ గొడవ కాస్త లోకల్ పోలీసులకు తెలిసి వారిని కట్టడి చేయడానికి వెళితే.. చంద్రబాబుకు ఉన్న ప్రజాధరణ చూసి అమెరికా పోలీస్ మొత్తం భద్రత కల్పించడానికి వచ్చిందని చందాల మోహన్‌రెడ్డి చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చందాల వసూళ్లలో జరిగిన గొడవను వైయస్ జగన్‌పై రుద్దడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
లోకేష్ మాట్లాడితే చిక్కుల్లో పడతారని పక్కనబెట్టారా..?
ఏపీలోనే ప్రజాధరణ లేని వ్యక్తికి అమెరికాలో ఉందని మంత్రి సోదిరెడ్డి చెప్పడం సిగ్గుచేటని కాకాణి విమర్శించారు. అమెరికాలో తెలుగుతమ్ముళ్లు తన్నుకుంటుంటే పోలీసులు పరుగెత్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ కూడా అమెరికా పర్యటనలో ఉన్నారని ముందుగా పేరు ప్రకటించడం జరిగిందన్నారు. కానీ అక్కడ ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడితే.. చిక్కుల్లో పడతారని, లోకేష్ అమరావతికి తప్ప బయటకు పనికిరాడని కొందరు చంద్రబాబుకు సలహా ఇవ్వడంతో తీసేశారని ఎద్దేవా చేశారు. బాహుబలి సినిమాలో బాహుబలి క్యారెక్టర్ చంద్రబాబుదని తెలుగుదేశం పార్టీ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్నారని, కానీ వాస్తవంగా బాహుబలి ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. వెన్నుపోటు పొడవడంతో చంద్రబాబు ఎక్స్‌పర్ట్ కాబట్టి కట్టప్ప క్యారెక్టర్ బ్రహ్మాండంగా బాబుకు సూటవుతుందన్నారు. నేను ఈ దేశంలో పుట్టాల్సిన వాడిని కాదు.. అమెరికాలో పుట్టాల్సినవాడినని ఇంతకు ముందే చంద్రబాబు చెప్పారని, ఏపీ ప్రజలు కూడా ఇంకో సంవత్సరంలో బాబును పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చురకంటించారు. అందుకనే బాబు తన శేషజీవితం ఎక్కడ గడపాలోనని అమెరికాలో స్థలాల వెతుకులాటకు వెళ్లారని ఎద్దేవా చేశారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత విదేశీ పర్యటనల పేరుతో పెట్టిన ఖర్చు ఎంతా..? వచ్చిన పెట్టబడులు ఎన్ని..? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించావ్..? నువ్వు పెట్టిన ఖర్చుకు పైబడి నిధులు వచ్చాయా..? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయగలవా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
నకిలీ ఎక్స్‌పర్ట్ అని సోదిరెడ్డికి వ్యవసాయశాఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోడమే మానేసిందని, మీకు మీరెందుకు పెద్దగా ఊహించుకుంటున్నారని కాకాణి ఎద్దేవా చేశారు. అమెరికాలో పచ్చ తమ్ముళ్ల తన్నులాట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వైయస్‌ఆర్ సీపీ సానుభూతిపరులు మెయిల్స్ పంచించారని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సోమిరెడ్డి నీ బతుకేంటో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో నకిలీ విత్తనాలు, ఎరువుల తయారీలో సూత్రదారుడిగా ఉన్ననిన్ను చంద్రబాబు వెతికిమరీ వ్యవసాయశాఖామంత్రిగా చేశాడన్నారు. గిట్టుబాటు ధర కల్పించకుండా ఏసీ గదుల్లో కూర్చొని దళారులతో, వ్యాపారులతో కమీషన్లు మాట్లాడుకుంటూ సోదిరెడ్డి రైతుల నోట్లో మట్టికొడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుది, నీది పేర్లు, వేషాలు ఒకటేనని ఆరోపించారు. వైయస్‌ఆర్ సీపీకి సంబంధం లేని విషయాల్లోకి లాగడం మానుకోవాలన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే మీకు వచ్చిన మెయిల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.