ఢిల్లీలో వైద్య విద్యార్థుల 'జనం సంతకం'

న్యూఢిల్లీ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జ‌గన్మోహన్‌రెడ్డి విడుదల కోసం ఢిల్లీలోని వైద్య విద్యార్థులు నినదించారు. శ్రీ జగన్‌ను విడుదల కోసం వైయస్ఆర్‌సిపి పిలుపునిచ్చిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువనేత శ్రీ జగన్‌ నాయకత్వం కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా ఢిల్లీలోని వైద్య విద్యార్థులు పలువురు తెలిపారు. శ్రీ జగన్ విడుదల కోరుతూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిని ఆల్‌ ఇండియా మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్సు -‌ఢిల్లీ) ఆస్పత్రి వద్ద వారంతా జనం సంతకం కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరుకు చెందిన వైద్య విద్యార్థి ఈదల కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతకాలు చేసిన వైద్య విద్యార్థులు‌ శ్రీ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

‌దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ కుటుంబం అంటే ఢిల్లీలో ఉంటున్న తెలుగువారే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అభిమానం కనబరుస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. మహానేత కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కుట్ర రాజకీయాల కారణంగా జైలులో ఉన్న శ్రీ జగన్ త్వరలో‌నే బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఢిల్లీలో మొత్తం 5000 సంతకాలు సేకరించి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డికి అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు కృష్ణారెడ్డి, రాహుల్‌రెడ్డి, ప్రేమ్‌చందన్‌రెడ్డి, ఫణిరెడ్డి, అశోక్‌రెడ్డి, అమరనాథ్, జిలాని, రాజే‌ష్‌గౌడ్, ప్రశాంత్‌యాదవ్, సూర్యచౌదరి, పృథ్వీకృష్ణ, అభిన‌య్‌మార్వా తదితరులు పాల్గొన్నారని కిషన్‌రడ్డి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top