దీక్షపై ప్రభుత్వం కుట్రలు..!

యువభేరి సక్సెస్ తో  పచ్చనేతల్లో వణుకు..!
దీక్ష అడ్డుకునేందుకు ఆటంకాలు..!
గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రత్యేకహోదాపై వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తుండడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పాలకపక్షం చేయలేని పనిని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేసి చూపుతుండడంతో పచ్చప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది. ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్ జగన్ ఈనెల 26 నుంచి గుంటూరులో చేపట్టనున్ననిరవధిక నిరాహార దీక్షను అడ్డుకునేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది.

ప్రజాధారణ ఓర్వలేక కుట్రలు..!
తిరుపతి, వైజాగ్ యువభేరి సక్సెస్ తో పాలకపక్షంలో అలజడి మొదలైంది. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణను తట్టుకోలేక చంద్రబాబు సర్కార్ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. యువభేరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో  దీక్షపై ఉక్కుపాదం మోపేందుకు అడ్డదారులు తొక్కుతోంది. విద్యార్థులను కట్టడి చేసేందుకు చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పినా పాచిక పారలేదు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమించేందుకు విద్యార్థి, యువత కదం తొక్కింది. 

అంతులేని అవినీతి, అరాచకాలు..!
రాజధాని ప్రాంతంలో  ప్రభుత్వం అవినీతి అరాచకాలకు హద్దే లేకుండా పోతుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సింది పోయి రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతర పోరు సల్పుతున్న ప్రతిపక్షనేతను అణగదొక్కాలని చూడడం సిగ్గుచేటని చంద్రబాబుపై మండిపడుతున్నారు. విద్యార్థులను అడ్డుకోవడం మొదలు, దీక్షకు అనుమతులు నిరాకరించడం, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి తేవడం లాంటి ప్రభుత్వ చర్యలను ఛీదరించుకుంటున్నారు. 

అనుమతివ్వకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు..!
గుంటూరు వేదికగా తొలుత దీక్ష కోసం వైఎస్సార్సీపీ నేతలు ఎంపిక చేసిన ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో, నగరంలోని యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఉల్ఫ్ హాల్ అనే ప్రైవేటు స్థలాన్ని సెలక్ట్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల సాకుతో మరోసారి పర్మిషన్ ఇవ్వకుండా దీక్షను అడ్డుకునే ప్లాన్ వేస్తున్నారు.  2009లో ఇదే ప్లేస్ లో టీడీపీ నాయకులు నడిరోడ్డుపై వేదిక ఏర్పాటు చేసి నిరాహార దీక్షలు చేసిన సంగతి గుర్తు లేదా అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top