దేవనబండలో షర్మిలకు ఘన స్వాగతం

దేవనబండ, (కర్నూలు జిల్లా), 11 నవంబర్‌ 2012: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కర్నూలు జిల్లా దేవనబండలో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం షర్మిల పాదయాత్ర దేవనబండకు చేరుకుంది. వేలాది మంది వెంట రాగా షర్మిల తన 25వ రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దారి పొడవునా మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు.

ఈ సందర్భంగా వారు తమ తమ కష్టాలను షర్మిలకు చెప్పుకుని ఉపశమనం పొందుతున్నారు. వివిధ వర్గాల ప్రజల కష్టాలను శ్రద్ధగా వింటున్న షర్మిల రాజన్న రాజ్యాన్ని జగనన్న త్వరలోనే తీసుకువస్తాడని, అందరి కష్టాలు తీరుస్తాడని ధైర్యం చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అబద్ధాల టిడిపికి బుద్ధి చెప్పి జగన్‌కు అధికారం అప్పగించాలని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర అటికెలగుండు, ఆస్పరి మీదుగా శంకరబండ వరకు కొనసాగుతుంది. శంకరబండలో ఆమె ఈ రాత్రికి బస చేస్తారు.
Back to Top