కౌన్సెలింగ్‌ విద్యార్థుల అయోమయం

వెబ్‌ సైట్లో వివరాలే పూజ్యం

హైదరాబాద్, 29 ఆగస్టు 2012: ఫీజుల నిర్ధారణ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తోంది.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కీలకమైన ఆప్షన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫీజులు, కాలేజీలు, సీట్ల వంటి వివరాలను ప్రభుత్వం ఇప్పటి వరకు కౌన్సెలింగ్ వెబ్ సైట్లో పెట్టలేదు.

ఈ నెల 27లోగా విద్యార్థులకు ఈ వివరాలు అందుబాటులో ఉంచుతామని కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త విధానాల సాకుతో ప్రభుత్వం వివరాలు వెల్లడించకుండా తాత్సారం చేస్తోంది. ఫీజులు తెలియకుండా ఆప్షన్లు ఏ విధంగా ఇస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈమారు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ బాగా ఆలస్యంగా మొదలైంది. అయినా ఫీజులపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోతే ఆప్షన్లు ఎలా సాధ్యమని తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఫీజులపై స్పష్టత వస్తే గానీ ఆప్షన్ల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు.

 

తాజా వీడియోలు

Back to Top