వలస కూలీల వ్యధ విన్న జననేత

వైయస్‌ జగన్‌ను కలిసేందుకు మూడు కిలోమీటర్లు పెరిగెత్తుకొచ్చి కూలీలు
గుంటూరు: పనులు దొరక్క పొట్టచేత పట్టుకొని జిల్లాలు దాటి వచ్చిన వలస కూలీలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ కలుసుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వలస కూలీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా పత్తికొండ, అనంతపురం గుత్తి నుంచి మిరపకాయలు పనికి గుంటూరు వలస వచ్చామని కూలీలు తెలిపారు. కరువు డబ్బులు అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని కూలీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. వైయస్‌ జగన్‌ వచ్చారని మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చామని కూలీలు అన్నారు. వైయస్‌ జగన్‌ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నామని, అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఎండలో రోజంతా కష్టపడినా కూలిడబ్బులు పొట్టకూటికి కూడా సరిపోవడం లేదని వాపోయారు. 
Back to Top