జగన్‌పై సీబీఐ, యెల్లో మీడియా కుట్ర

హైదరాబాద్‌, 14 సెప్టెంబర్‌ 2012: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగ‌న్మోహన్‌రెడ్డిపై సీబీఐ, యెల్లో మీడియా కుట్ర చేశాయని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాయలంలో ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని నిప్పులు చెరిగారు. ఎప్పుడు ఎవరి మీద అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రసారం చేసి ఇరికిద్దామా అనే ధ్యాస తప్ప యెల్లో మీడియాకు ప్రజా సమస్యలు పట్టలేదని విమర్శించారు.

వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించిన కొన్ని శక్తులే.. ఇప్పుడు బెయిల్‌ రాకుండా మరో కుట్ర చేస్తున్నాయని తెలిపారు. బెయిల్ పిటిష‌న్ విచారణకు వచ్చే ప్రతిసారి ‌యెల్లో మీడియా అబద్ధపు వార్తలను ప్రచురిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, టిడిపి, సీబీఐ,‌ యెల్లో మీడియా కుట్రలో భాగంగానే ఔట్‌లుక్ కథనం వచ్చిందని గట్టు మండిపడ్డారు.
Back to Top