ఏపీ ప్రజలకు కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు నమ్మకద్రోహం..

కాకినాడః రాష్ట్ర ప్రజలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఎమ్మెల్సీ  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే గాని మనుగడ సాధ్యం కాదన్న ఆనాడు ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ బిల్లు ప్రవేశపెడుతూ  చాలా స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆనాడు అదే సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు  బీజేపీ అధికారంలో వస్తే 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత ప్రత్యేకహోదాలను గాలికొదిలేశారన్నారు. ఒక హామీ కూడా సంపూర్ణంగా అమలు జరపలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఆరువందలకు పైగా హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేయలేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రుణామాఫీ అని చెప్పి టీడీపీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని, నేడు డ్వాక్రామహిళలు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకులకు వెళ్ళి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
Back to Top