న‌వీన్ నిశ్చ‌ల్‌పై అక్ర‌మ కేసు


అనంత‌పురం:  అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేత‌లు అక్ర‌మ కేసుల‌కు తెర లేపారు. అనంతపురం జిల్లా హిందూపురం  వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.  వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయమని అందుకే టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని అనంతపురం జిల్లా హిందూపురం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పేర్కొంటున్నారు. సర్వే పేరుతో వైయస్‌ఆర్‌సీపీ నేతలకు ప్రలోభాలకు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా సర్వే చేస్తున్న 15 మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ నేతల ఒత్తిడితో త‌న‌పై అక్రమకేసు నమోదు చేశార‌ని తెలిపారు.  సర్వే పేరుతో వైయస్‌ఆర్‌సీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమ‌న్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయం
అందుకే టీడీపీ నేతలు కుట్రరాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు.
Back to Top