కార్డులు ఇచ్చారు..సరుకులు మరిచారు?

’ యాక్టివేషన్‌ కాని జన్మభూమి రేషన్‌కార్డులు
’ లబోదిబో మంటున్న పేదలు
జియ్యమ్మవలసః నియోజకవర్గ వ్యాప్తంగా గత జన్మభూమి కార్యక్రమంలో పేదలకు అందించిన రేషనుకార్డులు  యాక్టివేషన్‌ కాలేదు. దీంతో ఈ కార్డులకు నిత్యావసర సరుకులు అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచే సరకులను పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు ఈనెలలో నిత్యావసర సరుకులకు వెళితే యాక్టివేషన్ కాలేదని డీలర్లు వెనక్కి పంపుతున్నారు.  కార్డులు ఇంకా ఓపెన్‌ కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. 
Back to Top