<br/>తిరుపతి)) వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రత్యేక హోదా డిమాండ్ తో పోరాటం చేస్తున్న పార్టీ మంగళవారం బంద్ పాటిస్తోంది. ఇందుకోసం అన్ని శ్రేణుల్ని పార్టీ నాయకులు కూడగడుతున్నారు. చిత్తూరు జిల్లా లో పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. యువత పెద్ద ఎత్తున మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్సీపీ కి , వైయస్ జగన్ కు జేజేలు పలుకుతూ యువత ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.