ఆంధ్రప్రదేశ్ అంతటా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్సీపీ నేత్రత్వంలో ప్రజలంతా తమ డిమాండ్ ను
ముక్తకకంఠంతో వినిపిస్తున్నారు. హోదా సాధించేదాకా వెనుదిరిగేది లేదని తెలియచేస్తూ
వస్తున్నారు. అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్
ను ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని
పట్టించుకోవటం లేదు. అంతిమంగా ప్రజల నష్టపోతున్నారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ స్పందిస్తూ వస్తోంది. హోదా లేదంటూ
కేంద్రం పంపిన సంకేతాలకు నిరసనగా బంద్ కు పిలుపు ఇచ్చింది. రాష్ట్రమంతా బంద్ ను
సంపూర్ణంగా నిర్వహించారు. తెలుగుదేశం నేతలు పోలీసుల్ని ఉసిగొల్పినా వెనుకంజ
వేయలేదు. ఎదురొడ్డి లాఠీ దెబ్బలు
తిన్నారు,
ఒళ్ళంతా గాయాలతో
ఒళ్ళంతా రక్తపు మరకలతో రోడ్లపైనే నిలిచారు. ప్రత్యేక హోదా కోసం చేసిన ఆంధ్రప్రదేశ్
బంద్ ను విజయవంతం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం అంటీముట్టనంటూ
ఉంటుందని,
ఎలాగైనా ప్రత్యేక
హోదా సంపాదించాలని వైయస్ జగన్ మోహన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్
కు పిలుపునిచ్చారు. దాంతో ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు. పార్టీ
కార్యకర్తలు నాయకులు తెల్లవారి జామునుంచే రోడ్లపై బైఠాయించి బంద్ ను విజయవంతం
చేశారు. బంద్ విజయవంతం కావడంతో ఆంద్రప్రదేశ్ ప్రజల బాధను కేంద్రానికి
తెలిసేలా చేయడంలో వైయస్ఆర్ సీపీ సఫలీకృతం అయింది.