ప్రజలకు శాపంగా చంద్రబాబు అసమర్థ పాలన


వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలి
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

తూర్పుగోదావరిః రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ పాలన ప్రజలకు శాపంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్ నాయకులు  మాజీ ఎంపీ  వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇసుక,మద్యం పేరుతో  కోట్లు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో బూత్ కమీటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణను ఆయన వివరించారు.  జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీసీ జెండా రెపరెపలాడడానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
 
Back to Top