బాబూ.. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఢిల్లీకి పంపావా

ప్రత్యేక హోదా
వర్తింప చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను  చంద్రబాబు నయుడు ఢిల్లీకి పంపారా లేదా చెప్పాలని
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం లో జరుగుతున్న వంచన
పై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ 
సందర్భంగా ఆయన రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న మోసంపై తీవ్రస్థాయిలో
మండిపడ్డారు.

ఆయన ప్రసంగంలోని అంశాలు...

 ఏపీకి ప్రత్యేక
హోదా కావాలని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం పెట్టారు. ఆ కాపీలు ఢిల్లీకి
పంపించారా. దమ్ముంటే ఆ కాపీలను బయటపెట్టాలి. హోదా వస్తే ప్రజలు బాగుపడతారు..
అందుకే అర్ధరాత్రి ప్యాకేజీకి అంగీకరించి ఆ డబ్బుతో చంద్రబాబు జల్సాలు
చేస్తున్నాడు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రశ్నిస్తూనే విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రంపై యుద్ధం చేస్తూనే ఉన్నారు. మోడీ
రాష్ట్రానికి  అన్యాయం చేస్తుంటే నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారైనా నిలదీయలేదు.
ప్రత్యేక హోదా కోసం ఈ నాలుగేళ్లు పోరాడింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే.
ఢిల్లీ వెళ్లి మోడీని చొక్కా పట్టుకుని నిలదీసే సత్తా చంద్రబాబుకు లేదు. ధర్మ
దీక్షల పేరుతో ఇక్కడ అధర్మ దీక్షలు చేస్తున్నాడు. బీజేపీ, టీడీపీలు
రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ను
గెలిపించి చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు.  

Back to Top