హైదరాబాద్, 4 సెప్టెంబర్ 2012 : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిదే అని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలో కోట్లాది మందికి మేలు జరిగిందని చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోకూడదని ఆయన సలహా ఇచ్చారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. పేదల ఆరోగ్యం దృష్ట్యా జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు భయపడవలసిన అవసరంలేదన్నారు. పార్టీ గుర్తు లేకుండా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గెలిచిన వారిని పార్టీలోకి తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.