హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో కచ్చితమైన ఆధారాలున్నందునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు కోర్టులపై నమ్మకం ఉంటే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.<iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/YvLAO0WmcuM" frameborder="0"/>