ఆ సర్వేలో శాస్త్రీయత లేదు

హైదరాబాద్, 17 ఏప్రిల్ 2013:

ఎన్నికలలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్న అంశంపై టైమ్సు నౌ చేపట్టిన సర్వే ఫలితాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి పెదవివిరిచారు. ఇది ప్రజలు నమ్మేదిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ సర్వేలో శాస్త్రీయంగా కొరవడిందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే  హవా అని మైసూరా రెడ్డి పేర్కొన్నారు.

Back to Top