ఆదిలాబాద్ జిల్లాలో విజయమ్మకు ఘనస్వాగతం

ఆర్మూర్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సభకు వెళుతున్న ఆమెకు జిల్లాలోని పలుచోట్ల ప్రజలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల జన్మదినం సందర్భంగా మామిడిపల్లి చౌరస్తాలో కార్యకర్తలు అందించిన కేక్‌ను విజయమ్మ కట్ చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, మళ్లీ రాజన్న రాజ్యం చూస్తామనీ శ్రీమతి విజయమ్మతో పలువురు మహిళలు చెప్పారు. నిర్మల్‌లో సభ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో విజయమ్మ నిజామాబాద్‌లోని బాజిరెడ్డి గోవర్దన్ ఇంటికి వచ్చారు. ఆమెకు బాజిరెడ్డి కుటుంబ సభ్యు లు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమె గంటసేపు బాజిరెడ్డి కుటుంబ సభ్యులతో గడిపారు.
Back to Top