17 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, 8 సెప్టెంబర్‌ 2012: శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చి నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ తరువాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ సమావేశం కాలేదు. 

అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి 22 వరకు ఐదు‌ రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా‌న్‌పై డిప్యూటీ సీఎం నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 
Back to Top