కూన రవిపై కేసు నమోదు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం
 

శ్రీకాకుళం : కూన రవిపై కేసు నమోదు చేయాలని పొందూరులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ జెండా పట్టుకోకపోతే పాతాళానికి తొక్కేస్తా అంటూ వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌ కూన రవి కుమార్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోన్‌ ఆడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. రవి బెదిరింపుల పట్ల ఆమదాలవలస, పొందూరులలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్వర్యంలో పోలీసు స్టేషన్‌ ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని రవిని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు, అభిమానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూన రవి కుమార్‌ పద్దతి మార్చుకోకపోతే జనమే ఆయన్ని పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు.  

Back to Top