ఇదంతా చంద్రబాబు నాటకమే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 

నెల్లూరు: ఎన్నికలు వాయిదా వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని, నామినేషన్‌ వేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేక ఆయన ఆడిన నాటకమే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు టీడీపీ కారణమని ప్రజలు నమ్ముతున్నారు. రాజకీయ పార్టీలతో చర్చించామన్న ఈసీ వైయస్‌ఆర్‌సీపీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు జరగడం చంద్రబాబు ఇష్టం లేదన్నారు. నామినేషన్‌ వేసేందుకు కూడా అభ్యర్థులు లేక చంద్రబాబు ఆడిన నాటకమిది అన్నారు.
 

Back to Top