స‌ర్వేప‌ల్లి కాలువ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

నెల్లూరు: నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ ప‌ర్య‌టించారు. అధికారులతో కలిసి పర్యటించిన ఆయ‌న‌ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్వేపల్లి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి అవి అందాయా? లేదా? అని తెలుసుకున్నారు. అర్హులందరికీ పథకాలను అందిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జగనన్నపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు.

తాజా వీడియోలు

Back to Top