శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌ తీసుకుంది

మంత్రి కన్నబాబు
 

అమరావతి: శవ రాజకీయాలకు తెలుగు దేశం పార్టీ పేటెంట్‌ తీసుకుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రజల కోసం ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధం తెచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూములతో మద్యపానాన్ని పోత్సహించారని తెలిపారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను టీడీపీ వక్రీకరిస్తుందని ధ్వజమెత్తారు. శవ రాజకీయాలు మానుకొని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు టీడీపీ ముందుకు రావాలని, స్పీకర్‌ చైర్‌పై పేపర్లు చించివేయడం దుర్మార్గమన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top