మరో 24 గంటల్లో పూర్తిస్థాయి సాధారణ పరిస్థితి

మంత్రి గుమ్మనూరు జయరాం
 

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లో మరో 24 గంటల్లో పూర్తిస్థాయి సాధారణ పరిస్థితి నెలకొంటుందని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శనివారం ఎల్జీ పాలిమర్స్‌ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫ్యాక్టరీ పరిసరాలు ఇప్పటికే సాధారణ స్థితిలోకి వచ్చాయన్నారు. నిపుణులు రంగంలోకి దిగారని, వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Back to Top