విజయవాడ: పవన్ జతకట్టని పార్టీ ఏదైనా ఉందా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒంటరిగా వచ్చే దమ్ము చంద్రబాబు, పవన్‌కు ఉందా అని సవాల్ చేశారు. పవన్ డైలాగ్స్ సినిమాల్లోనే బాగుంటాయని ఎద్దేవా చేశారు.