టీడీపీ ప్ర‌భుత్వంలో చాలా యాత‌న ప‌డ్డాం

 ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు కందుకూరి కల్పన 

గ‌న్న‌వ‌రం: టీడీపీ ప్ర‌భుత్వంలో చాలా యాత‌న ప‌డ్డామ‌ని వైయ‌స్ఆర్ ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు కందుకూరి కల్పన పేర్కొన్నారు. ఆమె ఏమ‌న్నారంటే..

చాలా యాతన పడ్డాం టీడీపీ ప్రభుత్వంలో. వాళ్లు ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఆమె ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతోంది, మేము వెళ్తుంటే పెన్షన్ మాకు ఇవ్వడం లేదు, ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని తెలుగుదేశం వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేకపోతుంది, లేవలేని మనిషి వాళ్ల అమ్మాయికి ఇవ్వండి అని ఎంతమంది రికమండేషన్ చేసినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు మేము ఇళ్లు కట్టుకున్నాం. పెన్షన్ ఇంటికే వస్తోంది, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించినవాళ్లు, అలా అనుగ్రహించి చూసినవాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టినవాడిలా మాకు సహాయం చేశాడు. సంతోషంగా స్థలం ఇచ్చాడు, ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. అన్నివిధాలా సహాయపడినందుకు మళ్లీ మళ్లీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం.

Back to Top