కనీసం లోను కూడా ఇవ్వడం లేదన్నా..

వైయస్‌ జగన్‌కు దివ్యాంగుడు మొర
విజయనగరంః రాజయ్యపేటకు చెందిన గోపయ్య అనే దివ్యాంగుడు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వికలాంగుడైన తనకు కనీసం లోను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. జన్మభూమి కమిటీలు టీడీపీ కార్యకర్తలకే లోన్‌ ఇస్తున్నారన్నారు.  తనకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా బతకడానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ముగ్గురు ఆడపిల్లల ఉన్నారన్నారు.భార్య, బిడ్డలను పోషించుకోవడానికి ఎటువంటి ఆధారంలేదన్నారు. టీడీపీ పాలనలో వికలాంగుల గురించి పట్టించుకునే వారే లేరన్నారు. ఆర్థికంగా ఆదుకోవాలని జన్మభూమి కమిటీలకు దరఖాస్తులు చేసిన ప్రయోజనం లేదన్నారు. ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసిన పట్టించుకోలేదని వాపోయారు.
 

Back to Top