అమరావతిని వివిధ దేశాల సౌజన్యంతో ఎంత గొప్పగా నిర్మిస్తున్నారో వివరించేందుకు చంద్రబాబు నాయుడు పత్రికా సంపాదకులను తన కార్యాలయనికి ఆహ్వానించారు.పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ప్లే చేశారు. ఎలా ఉందని సీనియర్ ఎడిటర్ ఒకాయన్ని అడిగారు చంద్రబాబు నాయుడు. "బానే ఉంది కానీండీ.. ఇంతకీ మన ప్రత్యేక హోదా విషయం ఏమైందండీ?" అని అడిగారా ఎడిటర్.చంద్రబాబుకు ఒళ్లు మండిపోయింది.అమరావతి గురించి పొగడకుండా ప్రత్యేక హోదా గురించి అడగడమేంటని రుస రుస లాడిపోయారు.ఆ కోపంతోనే..ఏం హోదా అండీ. అప్పుడేమో కాంగ్రెస్ అన్యాయంగా రాష్ట్రాన్ని చీల్చింది.అన్నారు.
ఎడిటర్ జోక్యం చేసుకుని ఔననుకోండి..కానీ అపుడు ప్రత్యేక హోదా కావాలని అడిగింది మీ వెంకయ్యనాయుడుగారే కదా..ఆ తర్వాత మీరూ..వెంకయ్యనాయుడుగారూ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు కదా. మీరైతే పదేళ్లు సరిపోదు పదిహేనేళ్లు కావాలన్నారు కదా అన్నారు గుర్తు చేసుకుంటూ.ఔనండీ అన్నాం. ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.ఇవ్వకపోతే ఇక్కడి ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఏం చేస్తోందండీ? ఏపీ బంద్ చేసింది. ఇక్కడ చేస్తే ఏం లాభం? పోయి ఢిల్లీలో చేయాలి కానీ.అయినా బిజెపి ప్రభుత్వాన్ని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఏమీ అనడం లేదు. మమ్మల్నే ఆడిపోసుకుంటోంది. ఇదేం న్యాయం? అని చంద్రబాబు నిలదీశారు.దానికి ఆ ఎడిటర్ బిక్కచచ్చిపోయి.. బిజెపి ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదాను సాధించుకోవలసింది అధికారంలో ఉన్న మీరు కదా? వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదండీ బాబూ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న మీరు బిజెపిని పల్లెత్తు మాట అనకుండా.. ప్రత్యేక హోదా ఇవ్వండని అడగకుండా ప్రతిపక్షంపై పడతారేంటండీ బాబూ అని అడిగేశారు.
చంద్రబాబు నాలిక్కర్చుకుని..బిజెపిని మేం ఎలా తిడతామండి? మేం మేం మిత్ర పక్షాలం కదా.మిత్ర ధర్మం ఉండొద్దా ఏంటి? అని ఎదురు ప్రశ్నించారు చంద్రబాబు.అసలింతకీ ప్రత్యేక హోదా వస్తుందా రాదా అది చెప్పండసలు అని మరో ఎడిటర్ అడిగారు.చంద్రబాబుకి ఏసీ గదిలోనూ నుదుటి మీద చెమటలు పట్టేశాయి.దేనికండీ ప్రత్యేక హోదా? అదేమన్నా జిందా తిలిస్మాతా?దాని వల్ల ఏం ప్రయోజనం లేదు తెలుసా అని బుకాయించారు.మరో ఎడిటర్ చిన్నగా దగ్గి..అంటే ప్రత్యేక హోదా అవసరం లేదంటారా? అని అడిగారు.చంద్రబాబుకి ముళ్లపై కూర్చున్నట్లుంది.ప్రత్యేక హోదా వద్దని ఎవరన్నారండీ?మేం మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నాం.పాతిక సార్లు ఢిల్లీ వెళ్లి మోదీ గారిని కూడా కలిశాం.అయినా వాళ్లు ఇవ్వలేదు మమ్మల్నేం చేయమంటారు అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
అంటే ఇక ఆశలు వదిలేసుకున్నట్లేనా తవరు అని ఓ ముసలి ఎడిటర్ అడిగారు.ఎలా వదులుకుంటామండీ? మాకు బిజెపి పై నమ్మకం ఉంది. ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇస్తారనే అనుకుంటున్నాను అన్నారు.మరి అరుణ్ జైట్లీ గారేమో ప్రత్యేక హోదా ఇవ్వలేం అని తేల్చేశారు కదా అని క్యూరియాసిటీగా అడిగారో యువ ఎడిటర్.చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు.మీ ఎంపీలు కూడా పార్లమెంటులో బిజెపికి మద్దతుగా ప్రత్యేక హోదా పై పెట్టిన ప్రైవేటు బిల్లును నీరు గారుస్తున్నారు కదండీ బాబూ అని కమ్యూనిస్టు భావాలున్న మరో ఎడిటర్ అడిగారు.చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు.అంతలో టీవీలో రాజ్యసభలో సుజనా చౌదరి చప్పట్లు కొడుతూ కనిపించారు.ఓ ఎడిటర్ కి అనుమానం వచ్చింది. సుజనా చౌదరి చప్పట్లు కొడుతున్నారేంటా అని పక్కనున్న ఎడిటర్లను ఆరా తీశారు.ప్రైవేటు బిల్లును పై ఓటింగ్ కు ఆస్కారం లేకుండా రాజ్యసభ ఛైర్మన్ కురియన్ అసలా ప్రైవేటు బిల్లు ద్రవ్య బిల్లా కాదా అన్నది తేల్చే అంశాన్ని లోక్ సభకు అప్పగిస్తూ రూలింగ్ చేశారు. అందుకే సుజనా చౌదరి చప్పట్లు కొట్టారని టీవీ ఫాలో అవుతోన్న ఎడిటర్లు చెప్పేసరికి చంద్రబాబు కి నోట మాట రాలేదు.
ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.అప్పుడే ఢిల్లీ నుండి ఎవరో ఫోను చేశారు.చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలమైపోయి..మనోళ్లకి అసలు ఏమన్నా ఉందా లేదా? ఆ చప్పట్లేంటయ్యా? అసలే మన గాలిపోయి గిజ గిజ కొట్టుకుంటూంటే మొత్తం పరువు పోయింది. అంటూ నిప్పులు చెరిగేశారు.సరిగ్గా అప్పుడే బేరర్ అందరితో పాటు చంద్రబాబు నాయుడికి ఓ కూల్ డ్రింక్ గ్లాస్ ఇచ్చాడు. చంద్రబాబు కూల్ గా తాగేసి.. అంచేత అమరావతిని మొత్తం ప్రపంచం అసూయపడేలా కట్టబోతున్నామన్నమాట. అన్నారు.ఎడిటర్లంతా లేచి నిలబడి ప్రశాంతంగా నవ్వి..మంచిది సార్.. ఉంటాం. అని సెలవు తీసుకున్నారు.మర్నాడు పచ్చ మీడియాలో మాత్రం చాలా వార్తలు వచ్చాయి. చంద్రబాబు విజన్ ను , ఆలోచనల్ని సంపాదకులు మెచ్చుకొన్నారని, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకొన్న అద్రష్టం అని రాసేశాయి. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండును అని భావిస్తున్నట్లు హెడ్డింగ్ లు పెట్టేశాయి. దీంతో ఆశ్చర్యపోవటం సంపాదకుల వంతయింది. ...........................