నెట్టింట్లో బాబుపై వ్యంగ్యాస్త్రాలు

  • అంతా బాబు గారి క్రెడిటేనంటా..!
  • నోట్ల రద్దుపై బాబు సెల్ఫ్ డబ్బా
  • చంద్రబాబు తీరుపై నెటిజన్ల వ్యంగ్య కామెంట్లు
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి తానే కారణం, ఆ క్రెడిట్‌ తనదేనంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్స్‌యాప్, తదితర సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో క్రెడిట్‌ తనదేనంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలను వ్యంగంగా మార్చి నెటిజన్లు తమ వాల్‌పై పోస్టులు పెట్టుతున్నారు. ఇరవ రూపాయల నోటుపై గాంధీ బొమ్మను తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబు పోటో పెట్టారు. ఇదిగో 420 నోటు అంటూ పలువురు పోస్టులు పెట్టి, తమ వ్యతిరేకతను చాటుకుంటున్నారు. 

నోట్ల రద్దు విషయాన్ని కేంద్రమంత్రుల ద్వారా ముందే తెలుసుకొని...ఒక రోజు ముందు హెరిటేజ్‌ను ఫ్యూచర్ సంస్థకు అమ్మి, తన బ్లాక్‌ మనీ మొత్తం వైట్‌ మనీగా మార్చుకొని చంద్రబాబు లబ్ధిపొందాడంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనుగోలు చేసి తన పార్టీలో చేర్పించుకున్న చంద్రబాబు, సంబంధిత ఎమ్మెల్యేలకు రూ.500ల నోట్లు ఇచ్చారని, నేడు అవి చెల్లకుండా పోయాయని అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు బాధపడుతున్నారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. బాబుపై వచ్చిన వ్యంగ పోస్టులకు ఇతరలు ఆసక్తిగా తిలకించి, లైక్లు, కామెంట్లు పెట్టి తమ వ్యతిరేకతను చాటుతున్నారు.

అంతే కాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిచి ఉంటే బాబును భరించలేకపోయే వాళ్లమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ లు పెట్టారు. హిల్లరీ గెలవడానికి తానే కారణమంటూ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ గొప్పలు చెప్పుకునే వాడని ఎద్దేవా చేస్తున్నారు. హిల్లరీ ప్రమాణానికి వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి అంటూ ఇదివరకే బాబు పచ్చమీడియాలో రాయించుకున్న సంగతి తెలిసిందే. గెలిస్తే ఆ ఘనత తనదేనంటూ డబ్బా కొట్టుకోవడం, ఓడిపోతే ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టడం బాబుకు అలవాటుగా మారింది. 
Back to Top