ఒక్క అడుగు...


ఆ ఒక్క అడుగు ఎంతో కీలకం. ఆ ఒక్క అడుగు ఎంతో ముఖ్యం. ఆ ఒక్క అడుగుపడితే ఫలితాలు తారుమారు అవుతాయి. ఆ ఒక్క అడుగు పడితే తలరాతలు మారిపోతాయి. ఆ అడుగు మహిమ అది. ఆ అడుగు పవర్ అది. ఆ ఒక్క అడుగు ఏమిటని అడుగుతున్నారు కదూ?? ఇంకే అడుగు...మన చినబాబుగారి లెగ్గు అడుగు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో మహా కూటమి తరఫున బాలకృష్ణ, చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు కానీ, చినబాబును మాత్రం ఆ ఒక్క అడుగు మాత్రం పెట్టనీయలేదు. ఆ నిర్ణయం కూటమి మొత్తం కట్టకట్టుకు తీసుకున్న నిర్ణయమా లేక, ఒకేలాంటి ఇద్దరు అవసరం లేదని కాంగ్రెస్ మాత్రమే తీసుకున్న నిర్ణయమా అని చాలా మందికి అనుమానం ఉంది. లేక సుపుత్రుడి సువర్ణ భాషణాలకు కళ్లెం వేసింది స్వయంగా చంద్రబాబా అన్న సందేహం కూడా చాలామంది వెలిబుచ్చారు.
అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అవునా తమ్ముళ్లూ అంటూ వాస్తవాలను లీక్ చేసే లీకేష్ ఒక్క అడుగు తెలంగాణాలో పడితే మొత్తం మహా కూటమే కకావికలం అయ్యుండేది అంటున్నారు కొంతమంది సీనియర్ నేతలు. అందుకే కూటమిలో సీట్ల పంపకాల కంటే ముందే చినబాబు ప్రచారం గురించి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఆ ఒక్క అడుగును పడనీయకపోతే చాలు మనకు పడే ఓట్లు అవే పడతాయని డిసైడ్ అయ్యారట కూటమి సభ్యులు. అందుకోసమే లెగ్గేష్ గారి అడుగులు తెలంగాణాలో పడలేదని అంటున్నారు. కన్న ప్రేమ కొద్దీ బాబుగారు లోకేష్ తో ప్రచారం చేయిస్తే ’తెలంగాణాకి పట్టిన తెగులు మహా కూటమి’ అంటూ మళ్లీ ఎక్కడ నిజాలు లీక్ చేస్తాడో అని అందరి భయమూ. 
అసలే హైటెంక్షన్ లో ఉన్న తెలంగాణ ఎన్నికల్లో చినబాబు ఒక్క అడుగుపడితే చాలు మహకూటమికి పూటకో షాకు గ్యారెంటీ. అందుకే హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి లో కూడా నారా లోకేష్ అడుగు పడనీయలేదు. అసలే బట్టీ పట్టి అప్ప చెబుతున్న సుహాసినికి, లీకేష్ తోడైతే ప్రచారంలో మహా కూటమికి ముచ్చెమటలు పడటం తప్పదనే దూరం పెట్టారు. ఇక ప్రచారం పూర్తి అయిపోయింది. మరొక్క రోజులో ఎన్నికల ఫలితాలు తెలిసిపోతాయి. కనుక ఈ ఒక్క రోజు కూడా లోకేష్ ని ఆ ఒక్క అడుగు దూరంలో ఉంచుతూ, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందుకైనా ఫలితాలు తమకు అనుకూలం అవుతాయేమో అని ఆశగా ఎదురు చూస్తోంది మహాకూటమి... అయితే చినబాబును మించిన ఆయన తండ్రిగారు చంద్రబాబుగారు అక్కడే ఉన్నారని, ఆయన లెగ్గు మహిమకు 40 ఏళ్ల చరిత్ర ఉందని కాంగ్రెస్ మర్చిపోవడమే విషాదం. 
 

తాజా వీడియోలు

Back to Top