నిప్పులు తొక్కిన కోతి కథ

ఓ కోతి ఎర్రగా, బుర్రగా ఉంది. ఉండుండి చెట్ల కొమ్మల నుంచి కిందకు తలకిందులుగా వేలాడుతూ, పళ్లు బయటపెట్టి కిచకిచా నవ్వుతోంది. ఓసారి ఊళ్లో జరిగిన జాతరకొచ్చింది. అక్కడున్న మైకుసెట్టు ముందుకొచ్చి గొంతు సవరించుకుంది.

తన కిచకిచ భాషలో గిజగిజా మాట్లాడింది. విన్న జనాలంతా ఘొల్లున నవ్వారు. తన మాటలకు జనాలు విలువ ఇవ్వడం లేదని ఎర్రకోతికి కోపం వచ్చింది. అవమానం వేసింది.తన పనులతో వాళ్లను ఆశ్చర్యపరచాలనుకుంది.

చూడండి ఏం చేస్తానో ... మీ కళ్లముందే నిప్పులు తొక్కుతాను అని శపథం చేసి వేదిక దిగింది. నిజంగా కోతి నిప్పులు తొక్కుతుందా?? నిప్పులు తొక్కిన కోతి ఏం చేస్తుంది??

 అని రకరకాలుగా మాట్లాడుకుంటూ జనాలు చెవులు కొరుక్కున్నారు...తాటి తోపు వెనకాలకెళ్లి కసాబిసా నడిచి వచ్చేసింది ఎర్ర కోతి. చూడండి నేను మీ అందరికోసం నిప్పులు తొక్కాను అంది దర్పంగా. 

కాలుగాలిన పిల్లి, నిప్పుతొక్కిన కోతి ఎలా ఉంటాయో జనాలకు బాగా తెలుసు...మరి ఈ కోతి ఇలా ఉందేంటి అంటూ ఆరా తీసారు. తీరా తెలిసిందేంటయ్యా అంటే ఆ ఎర్ర కోతి తొక్కిన నిప్పులు కణ కణలాడేవి కాదు...కంపు కొట్టేవీ...

అర్థం కాలేదు కదూ...

ఊళ్లలో తాటితోపుల వెనుక చెబుంతో వెళ్లే పెద్దోళ్లనడిగితే చెబుతారు నిప్పులు అంటే ఏంటో????

Back to Top