రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ అదృష్టవంతులు

సీఎం వైయస్‌ జగన్‌ విజన్‌ మహిళల తలరాతలు మార్చే సువర్ణాధ్యాయం

నెక్ట్‌ జనరేషన్‌ కోసం ఆలోచించే ప్రజానాయకుడు వైయస్‌ జగన్‌

ఆడబిడ్డ పుట్టుకను హేళన చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది

చంద్రజ్యోతి, చంద్రనాడు కోసమే బాబు డ్రామాలు

లోకేష్‌ పెరిగింది హెరిటేజ్‌ పాలు తాగా? డ్రైనేజీ నీళ్లు తాగా?

గ్రామ సర్పంచ్‌గా గెలవలేని లోకేష్‌కు.. సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం

అసెంబ్లీ: మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత, హక్కు కేవలం వైయస్‌ఆర్‌ సీపీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో 17 నెలల కాలంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను.. ఆడబిడ్డకు హామీ ఇస్తే.. తన కన్నతల్లికి ప్రమాణం చేసినంత పవిత్రంగా భావించి.. ప్రతి ఒక్కటీ సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. ఇలాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ అదృష్టవంతులు. ఇలాంటి సీఎం దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. మహిళల కోసం ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు, చట్టాలు, నిర్ణయాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సొంతమన్నారు. 

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘నెక్ట్‌ ఎలక్షన్స్‌ గురించి ఆలోచించే వారిని రాజకీయ నాయకులు అంటారు.. నెక్ట్‌ జనరేషన్‌ గురించి ఆలోచించే వారిని ప్రజానాయకుడు అంటారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడూ రాబోయే ఎన్నికల గురించి ఆలోచించరు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ప్రజా నాయకుడు వైయస్‌ జగన్‌. విజన్‌ అంటే చంద్రబాబులా 420 విజన్‌ కాదు.. విజన్‌ అంటే టెలివిజన్‌లో పబ్లిసిటీ చేసుకోవడం కాదు.. విజన్‌ అంటే టెలిస్కోప్‌ పెట్టి చూసినంత స్పష్టంగా భావితరాల భవిష్యత్తు కనిపించాలి. 

సీఎం వైయస్‌ జగన్‌ విజన్‌ రాష్ట్రంలోని మహిళల తలరాతలు మార్చే సువర్ణ అధ్యాయంగా మారుతుంది. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే గొప్ప సాధికారతను సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తున్నారు. ప్రతీ పథకం మహిళలకే, ప్రతీ ప్రయత్నం మహిళా అభ్యున్నతికే పాటుపడుతున్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు సగం మహిళలకే, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకే, పనుల్లో 50 శాతం, మార్కెట్‌ కమిటీల్లో 50 శాతం పదవులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే కల్పించారు. డిప్యూటీ సీఎంగా, హోంమంత్రి పదవులు మహిళలకే ఇచ్చారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకే, 43 లక్షల మంది మహిళలకే అమ్మఒడి, 88 లక్షల డ్వాక్రా మహిళలకే వైయస్‌ఆర్‌ ఆసరా, 24 లక్షల మంది మహిళలకు వైయస్‌ఆర్‌ చేయూత, 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, ప్రతి ఆడబిడ్డను రక్షించే దిశ చట్టం, దశల వారీగా మద్యపాన నిషేధం ఇలా ఎన్నో పథకాలు, చట్టాలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రియేటర్‌గా నిలిచారు. 

మహిళల కోసం గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్న వైయస్‌ జగన్‌ గురించి ఒక ఛీటర్‌ మొదటి రోజు నుంచి విషప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో మహిళల జీవితాలను నాశనం చేసేలా కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ వాళ్ల నాయకులతో నడిపించడం, బెల్ట్‌షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారించడం ప్రజలంతా చూశారు. కోడలు మగ పిల్లాడు కంటే అత్త సంతోషించదని మహిళా పుట్టుకనే హేళన చేసిన చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. 

చంద్రబాబును, ఆయన పార్టీని షేక్‌ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. చంద్రబాబు జూమ్‌ మీటింగ్‌లకు అలవాటు పడి స్పీకర్‌ పోడియం దగ్గర కూర్చొని కెమెరాల వంక చూస్తున్నాడని, చంద్రజ్యోతి, చంద్రనాడులో ఏ ఫొటో రావాలి.. ఏ హెడ్డింగ్‌ రావాలని ముందే నిర్ణయించుకొని అసెంబ్లీకి వచ్చి తగిన విధంగా నాటకాలు ఆడుతున్నారు. ఎవరో రాసిచ్చిందాన్ని ట్విట్టర్‌లో పెడుతున్న లోకేష్‌... హెరిటేజ్‌ పాలు తాగి పెరిగాడా..? డ్రైనేజీ నీళ్లు తాగి పెరిగాడా..? అనే అనుమానం కలుగుతుంది. గ్రామ సర్పంచ్‌గా కూడా గెలవలేని లోకేష్‌కు.. తన సొంత జెండా, అజెండాతో 151 సీట్లు గెలుచుకున్న సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు. 

Back to Top