పూటకో పార్టీతో మూడు ముక్కల రాజకీయం పవన్‌దే

 - *ఆయన చేసేది రాజకీయ వ్యభిచారం కాక మరేమిటి...?*

- *పవన్‌ కళ్యాణ్‌ యువశక్తి సభ వల్ల ఎవరికి ప్రయోజనం.?*

- *ఆత్మస్థుతి, పరనింద తప్ప సభలో ఏమీ లేదు*

- *ప్రభుత్వాన్ని, జగన్‌ గారిని తిట్టడానికే సభ పెట్టినట్లున్నాడు*

- *యువత కోసం అనేది మిధ్య...*

- *నేను చంద్రబాబు సంకలోకి ఎక్కుతున్నా అని చెప్పడానికే ఈ సభ:* మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)

- *వ్యావహారిక భాషలో పవన్ కళ్యాణ్ తిరుగుబోతు*

- *నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు*

- *నువ్వూ, చంద్రబాబు కలిసి నడిపిన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..?*

- *ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా...ఆరాటమా..?*

- *నీ వేదికపై నువ్వు చెప్పిన రజక, నాయూ బ్రాహ్మణ వంటి కులాలు వారు ఎక్కడా..?*

- *జగన్‌ గారి చేతిలో రెండో సారి కుక్కచావు చావలేను*

- *గ్లాసుతో టీ తాగి ఫ్యాన్‌కి ఓటేశారని కార్యకర్తలనే నమ్మనంటున్నాడు*

- *నాకు భయం లేదని అన్ని సార్లు చెప్పాడంటే భయపడుతున్నట్లే*

- *కాపులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణే*

- *నీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై వెంట్రుక కూడా ఊడదు*

- *రోజా ధైర్యంగా పోరాడి రెండు సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా చేస్తోంది*

- *నువ్వు పోటీ చేసిన రెండు చోట్లా  ఓడిపోయావు...అదీ నీ స్థాయి*

- *నీ ఇంట్లో ఆడవారు సినిమాల్లో నటించడం లేదా..?*

- *నా దగ్గర కూడా రెండు చెప్పులు ఉన్నాయ్‌...నేను కూడా తీయగలను*

- *రాజశేఖరరెడ్డి గారి పంచెలో పోగునైనా కదిలించగలిగావా..?*

 మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో  ఏం మాట్లాడారంటే:*

-ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి నింపుతానని, ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఓ నెల రోజుల నుంచి చెప్తూ చెప్తూ ఈ రోజు సభ ప్రారంభిచాడు

-12 గంటల నుంచి కుర్రాళ్లను వేచిఉంటే రాత్రికి ఆత్మస్థుతి, పరనింద పారాయణం చేశాడు

-తన సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం, జగన్‌ గారిని, ప్రభుత్వాన్ని బూతులు తిట్టడం తప్ప ఆ సభలో ఏమీ లేదు

-లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి, చర్చిల్, లెనిన్, స్టాలిన్, మావో...ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లు విమర్శిస్తే తట్టుకుంటాడట

-తనది వాళ్లంతటి గొప్పటి వ్యక్తిత్వం చెప్పుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే కుసంస్కారంతో కూడిన భావప్రకటనా స్వేచ్ఛ కలిగిన దిగజారిన మనిషి పవన్‌ కళ్యాణ్‌

-మైకు దొరికిందని, మూడు నాలుగు వేల మంది ముందు కూర్చున్నారని, టీవీలన్నీ చూపిస్తాయని ఏదేదో వాగుతున్నాడు

-ఏరా ఓరే అంటూ మాట్లాడటం కుసంస్కారం కాక ఏమంటాడు

-ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను అసభ్య పదజాలంతో మాట్లాడటం, వ్యక్తత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం తప్ప ఆ సభ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు

-చివరికి వచ్చిన జనసేన కార్యకర్తలకు కూడా ఆ సభ వల్ల ఉపయోగం లేదు

-రాష్ట్రం నలుమూలల నుంచి సినిమా పిచ్చితో నమ్మి అక్కడకు వచ్చిన వారినికూడా తానున నమ్మను అంటాడు

-ఇదెక్కడి దౌర్భాగ్యం..? నిన్ను నమ్మి నీలాగే అన్నా వదినలను సతాయించినట్లు, వారి అమ్మానాన్నలను సతాయించి అంత దూరం నుంచి అక్కడకు వస్తే మీరు నన్ను నట్టేటా ముంచేస్తారు అంటాడు

-నా కులపోడు, చుట్టం, స్నేహితుడంటూ మీరు వేరే వారికి ఓటు వేస్తారు అంటూ వారిని తిడతాడు

-సరే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనంటే మీరు ఎలాగూ ద్వేషిస్తారు..చివరికి నిన్ను నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు

-జగన్మోహన్‌రెడ్డి గారంటే ఆయనకు ఎంత ద్వేషం, అసూయ, ఈర్ష లేకపోతే మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటాడా.?

-సొంత పార్టీ ఒకటి పెట్టి బీజేపీ, టీడీపీతో అంటకాగింది నువ్వే...తూచ్‌ అని చంద్రబాబు, ఆయన కొడుకును బూతులు తిట్టి రెండో ముక్కగా అంటకాగింది ఆయనే

-ఇప్పుడు మూడో ముక్కగా చంద్రబాబుతో తయారుగా ఉన్నాడు...ఇక మూడు ముక్కల రాజకీయం చేసేది పవన్‌ కళ్యాణే

-ఎవరో సినిమా కవులో, డైరెక్టర్లో రాసిచ్చిన డైలాగులు చదివే నువ్వు జగన్‌ గారి గురించి సంధి ప్రేలాపణలు మాట్లాడుతున్నాడు

-నువ్వు చేసే దాన్ని రాజకీయ వ్యభిచారం అనక ఏమంటారు..?

-ఒక పక్క బీజేపీతో మైత్రి బంధం అంటాడు...పక్కచూపులు, కన్ను కొట్టుడు, కాలు గీటుడు చంద్రబాబుతో...

-దీన్ని రాజకీయ వ్యభిచారం అనక మరేమంటారు..?

-మోడీ గారి వద్ద నాకు పిలుపు వచ్చి ఎనిమిదేళ్లయ్యింది అని ఆ రోజు అన్నావ్‌

-ఇప్పుడేమీ మీవల్లే మోడీ వద్ద నా పలుకుబడి అంటున్నావ్‌...అప్పుడు సత్తా లేదా..?

-పూటకో మాట రోజుకో మాట...నోటికి ఏదొస్తే అదిమాట్లాడుతున్నాడు...

-ఈ రకమైన బరితెగింపు రాజకీయాలు చేసే వ్యక్తి దేశంలో ఒక్క  పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే

 

*ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా...ఆరాటమా..?*

-2014 నుంచి 19 వరకూ చంద్రబాబు, నువ్వు కలిసి ప్రభుత్వం నడిపారు కదా...ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పాలి

-ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌ గారిని నిత్యం తిడుతూనే ఉన్నావ్‌

-అధికారం లేకపోయినా ఏదైనా చేయొచ్చు అన్న నువ్వు...మరి ఉద్దానాన్ని ఎందుకు ఉద్దరించలేకపోయావో చెప్పాలి

-చంద్రబాబు హయాంలో మత్స్యకారులు కనిపించలేదా..? జెట్టీ కట్టించాలని అప్పుడు తెలియలేదా..?

-ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా...ఆరాటమా..?

-అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఎందుకు కట్టించలేదు...

-ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి గారు అక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ కట్టిస్తున్నాడు..పనులు జరుగుతున్నాయి

-నువ్వు కలలు కంటుంటే ఆల్‌ రెడీ పనుల్లోకి వెళ్లిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి గారు

-కాపులను, మత్స్యకారులను, బీసీలను మోసం చేసి కులాలు లేవని మాట్లాడుతున్నాడు

 

*నీ వేదికపై రెండు కులాల వారే ఎందుకు ఉన్నారు..?*

-రాజకీయం అంతా మూడు కులాలు మధ్యనే తిరుగుతోంది అంటున్న నువ్వు నీ వేదికపై మీ ముగ్గురే ఎందుకున్నారు..?

-ఇద్దరు కాపులు, ఒక కమ్మ తప్ప ఒక రజకుడు దొరకలేదా..? మీటింగుకే కొప్పుల వెలమలా...? మీటింగుకే ఇతర కులాలా..?

-మీరు లేచి వారిని ఎందుకు కూర్చోబెట్టలేదు..కుర్చీలు వేసే మనసు కూడా మీకు రాలేదు.

-చంద్రబాబు నువ్వు ఏం మాట్లాడుకున్నారో రాష్ట్రమంతా తెలుసు. దానికి ఇంటిలిజెన్స్‌ వారిని అడగాల్సిన అవసరం లేదు

-రెండు రాజకీయ పార్టీల అధ్యక్షులు కూర్చుంటే దేశం బాగోగుల గురించి కలదా మాట్లాడుకోవాల్సింది

-మనం బీజేపీతో అంటకాగి ఐదేళ్లు ప్రజల్ని మోసం చేశాం అని మాట్లాడుకోవాలి కదా

-అంబటి రాంబాబు గురించి 27 నిమిషాలు, ఐటీ శాఖ మంత్రి గురించి 38 నిమిషాలు మాట్లాడుకున్నారట.  హోం మంత్రి గురించి 22 నిమిషాలు మాట్లాడుకున్నారట

-ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయాలు ఏముంటాయి

-నా అంత ధైర్యవంతుడు లేడు అంటాడు...చంద్రబాబునాయుడు ఇంట్లో టీ పట్టుకొస్తే కప్పులు పట్టుకెళ్లే వ్యక్తి వెళ్లే వరకూ మాట్లాడుకోలేదు అన్నావు కదా

-మీరు మాట్లాడుకునే రహస్యాలు బయటికి వెళ్లిపోతాయి అనే భయం మీకు 

-మళ్లీ నేను ధీరోదాత్తుడిని, ధైర్య వంతుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు

 

*జగన్‌ గారి చేతిలో రెండో సారి కుక్కచావు చావలేనని స్పష్టంగా చెప్పాడు*

-పవన్‌ కళ్యాణ్‌ ధైర్యంగా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. కార్యకర్తలను నమ్మలేనని, వాళ్లు ఓటేయరని చెప్పాడు

-వీరమరణం మళ్లీ చావలేనని, రెండో సారి చస్తే కుక్క చావు అవుతుందనే నిజం చెప్పాడు

-ఈ మీటింగు మాత్రం నేను మళ్లీ చంద్రబాబు సంకలో చేరుతున్నాను అని చెప్పడానికి పెట్టాడు

-జగన్‌ గారి చేతిలో ఒక సారి బడిత పూజ అయిపోయింది. రెండో సారి కూడా కుక్క చావు చావడం దేనికని చంద్రబాబు సంక ఎక్కుతున్నాను అని చెప్పాడు

-ఊగటం, ఆగటం ఉత్తరాంధ్రలో పవన్‌ నేర్చుకున్న విద్యే అది

-చంద్రబాబుకు తనకు ఒక అత్తతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, దత్తతండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో అనే పవన్‌ కళ్యాణే చెప్తున్నాడు

-మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి గారు నీ గురించి నిజం చెప్తే మళ్లీ ఉలుకుపడతాడు

 

*వ్యావహారిక భాషలో పవన్ కళ్యాణ్ తిరుగుబోతు*

-సామాన్య జనం మాట్లాడుకునేటటువంటి తెలుగు బాష వ్యాప్తి చెందడానికి ఉద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి, గురజాడ ఇద్దరూ ఇంట్లో భార్య ఉండగా పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్న వారిని తిరుగుబోతు అన్నారు

-మరి తిరుగుబోతులకు జై కొట్టాలి..బ్యానర్లు కట్టాలన్నపుడు...

-చంద్రబాబు, సోనియా గాంధీ ఇద్దరూ అక్రమ సంధితో తప్పుడు కేసులు పెట్టారని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రాష్ట్రానికి నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి గారిని ఎన్నుకున్నారు

-నువ్వు ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు

-ఈ రాజకీయ నాయకులు అంటాడు...మరి నువ్వేవెవరివి...రాజకీయ నాయకుడివి కాదా..?

-ఏటా వంద కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి సినిమాలను వదిలేసి వచ్చాను అన్నావ్‌...

-జగన్మోహన్‌రెడ్డి గారు మీరు మంచిగా పరిపాలనను అందించండి...నేను సినిమాలు చేసుకుంటాను అని నువ్వే అన్నావ్‌

-చెప్పినమాట ప్రకారం సినిమాలు చేసుకుంటున్నాడు...

-25 కోట్లు టాక్స్‌ కడుతున్నాను అంటే మీ సంపాదన ఎంత..? ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు..?

-సినిమాకు మీరు తీసుకునేది యాభై కోట్లు కదా...దాంట్లో వైట్‌ ఎంత తీసుకుంటున్నారు..?

-ముస్లింలు ఉంటే అబ్దుల్‌ కలాం వల్లే రాజకీయాల్లోకి వచ్చానంటాడు..బ్రాహ్మణులు ఉంటే పీవీ నరసింహరావు వల్ల అంటాడు

-ఇప్పుడు రణస్థలం వెళ్లి గిడుగు రామ్మూర్తి స్ఫూర్తితో వచ్చానంటాడు..అది నోరా..ఇంకేమన్నానా..?

 

*గ్లాసుతో టీ తాగి ఫ్యాన్‌కి ఓటేశారని కార్యకర్తలనే నమ్మనంటున్నాడు*

-గ్లాసుతో టీ తాగారు పోలింగ్‌ బూత్‌ కి వెళ్లి ఫ్యాన్‌కి ఓటేశారు అంటాడు...ఈ బాధ పగవాడికి కూడా వద్దురా బాబూ

-సభ మొత్తంలో 13 సార్లు నాకు భయం లేదు అన్నాడు...భయం లేదు అని చెప్పుకోవాలా...?

-జగన్‌రెడ్డి అంటూ నువ్వు కూడా చేతి దగ్గరకు వచ్చి మాట్లాడు...

-చంద్రబాబు కొడుకును కూడా చేతికందేట్లు వెళ్లి తిట్టావా..? మొన్న చంద్రబాబును కలిసినప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడలేదు?

-ప్రమాణ స్వీకారం దేనికి సామీ..? ముఖ్యమంత్రికా...మంత్రికా..ఎమ్మెల్యేకా...?

-మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 175 సీట్లకు పోటీ చేయాలి కదా..

-నువ్వే కుక్క చావు చస్తున్నానని నీ నొటితోనే చెప్తున్నావు...చంద్రబాబు సంకనెక్కితే కానీ ఏడవలేను అంటున్నావ్‌

-మరి ముఖ్యమంత్రి ఎవరు...? నిన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి చంద్రబాబు ఒప్పుకోడు కదా..

-పోనీ చంద్రబాబు వద్ద మంత్రి చేస్తావా..? లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటివి చేస్తావా...అసలు నీ ఆలోచన ఏంటి..?

-ఎవర్నో అర్కెస్త్రాలను తీసుకొచ్చి మాట్లాడించడం వల్ల నీ ముందు కూర్చున్న కుర్రాళ్ల వద్ద పలుచన కావడం తప్ప వేరేది కాదు

-ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబునాయుడి పంచన చేరి ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నాడు

 

*కాపులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణే*

-కాపుల్ని ఏవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే అది నువ్వే పవన్‌ కళ్యాణ్‌

-నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే నీతో సెల్ఫీలు దిగేవాడెవ్వడు..?

-నాకు చిరంజీవి గారంటే విపరీతమైన పిచ్చి...అలాంటి వ్యక్తి దగ్గరే నేను సెల్ఫీ దిగలేదు...నీతో ఎందుకు దిగుతారు..?

-నువ్వు మాతో సెల్ఫీలు దిగాల్సిందే తప్ప మా వాళ్లు ఎవరూ నీతో సెల్ఫీ దిగరు

-నువ్వు నటుడివి కదా...యాక్షన్‌ చేస్తూ మాట్లాడతావు...ముందు కాగితం పెట్టుకుని చత్వారం కళ్లజోడు పెట్టుకుని చదివేస్తూ జగన్‌గారికి నీతి కబుర్లు చెప్తున్నావ్‌

-చివర్లో జేబులోంచి తీసి చదివింది హైదరాబాద్‌ కవులు రాసిచ్చిన స్క్రిప్టేగా...ప్రింట్‌ తీసుకుని జేబులో పెట్టుకున్నావా..?

-ఇంతకీ ఈయన బీజేపీతో ఉంటాడా...? టీడీపీతో ఉంటాడా..? అందరితో కలిపి ఉంటాడా అనే స్పష్టత లేదు

-తప్పుడు కేసుల్లో ఇరుక్కుని, మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన వారికి సెల్యూట్‌ కొట్టడం గర్వపడే అంశం

-వ్యక్తత్వం లేకుండా గిడుగు రామ్మూర్తి గారు చెప్పిన తిరుగుబోతుకు సెల్యూట్, జిందాబాద్‌ కొట్టడం దారుణం

 

*నీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై వెంట్రుక కూడా ఊడదు*

-ఇతని భావదారిద్యంతో దిగజారి మా పార్టీ వారిని ఎన్ని తిట్టినా నీ నోటి తీట తీరుతుందేమో కానీ...జెండా మోసే వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై ఉన్న వెంట్రుకకు కూడా ఊడదు

-ఒక సినిమా మాజీ నటి, ఒక కళాకారురాలిని సినిమాల్లో నటించిందని ఎంత దిగజారి మాట్లాడావు...?

-మీ ఇంట్లో ఆడవారు సినిమాల్లో నటించలేదా..? వారి పట్ల కూడా ఇదే అభిప్రాయమా..?

-సినిమాల్లో నటిస్తున్న ఆడవారిపై నీకున్న కుసంస్కారం, తప్పుడు బుద్ధి ఈ రోజు సభాముఖంగా స్పష్టమైంది. 

-నీ మనసులో ఉన్న భావాన్ని, వ్యక్తిత్వాన్ని భయటపెట్టావ్‌...ఇదంతా సమాజం చూస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు

-రోజా ఏం తప్పుడు పనిచేసింది..? సినిమాల్లో నటిస్తే చులకనా..? మీ ఇంట్లోకూడా నటిస్తున్నారు కదా

-నీ వయసంతా...నీ పక్కన నటిస్తున్న వారి వయసెంత..?

-వేదికలెక్కితే పెద్ద పెద్ద మాటలు...చివరికి కుసంస్కారమా..?

-తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడే నిన్న మా వాడివి అని చెప్పుకోడానికే సిగ్గేస్తుంది

-రోజా దమ్ముగా రెండు సార్లు జనంలో గెలిచింది. నీలాగా రెండు చోట్లా ఓడిపోలేదు

-దమ్ముగా పదేళ్లు శాసన సభ్యురాలిగా చేసి ఈ రాష్ట్రాన్ని మంత్రిగా చేస్తోంది...

-సిగ్గు శరం లేకుండా ఆడవారి గురించి నీచంగా మాట్లాడతావా..? 

-సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒక్కటే కాదు...కాస్త వ్యక్తత్వాన్ని కూడా నేర్చుకో

-జనసేన జెండా మోసే కార్యకర్తలను నేను నమ్మడం లేదు...నేను చంద్రబాబుతో వెళ్లిపోతున్నాను...టాటా గుడ్‌ బై అని చివరిగా చెప్పాడు

-నేను చంద్రబాబు సంకలో ఎక్కినా కూడా మీరంతా నన్ను నమ్మండి అంటున్నాడు

 

*ఇప్పటికైనా ముసుగు తీసినందుకు ధన్యవాదాలు*

-పవన్‌ కళ్యాణ్‌ ఇన్నాళ్లకు ఒక మంచి పనిచేశాడు..ముసుగు తీసి తాను చంద్రబాబు మనిషినని స్పష్టం చేశాడు

-ఇక నుంచైనా ఆయన నోటి జాడింపు మానుకుంటే మంచిది..

-మానుకోకపోతే నా దగ్గర కూడా రెండు చెప్పులు ఉన్నాయ్‌...నేను కూడా తీయగలను

-నా చేతికి అందేట్లు వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వారి గురించి మాట్లాడు..

-సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, చెడిపోయిన వ్యక్తత్వంతో నాయకుడిగా ఫోజులు కొట్టడం మానుకో

 

*రాజశేఖరరెడ్డి గారి పంచెలో పోగునైనా కదిలించగలిగావా..?*

-2009 ఎన్నికల్లో మహానేత వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం చేసేప్పుడు పంచె ఊడిపోయింది కదా...దాన్ని ఊడదీసింది ఈయనేనా..?

-ఏం పొడిచాడు...? 2014 వరకూ అడ్రస్‌ లేడు..రాజశేఖరరెడ్డి గారు కట్టుకున్న పంచె దారపు పోగును కూడా టచ్‌ చేయలేవు...

-నేను లేస్తే మంచోడిని కాదు అని సొల్లు చెప్పడం తప్ప ఇతను ఏం చేయగలిగాడు..?

-రాజశేఖరరెడ్డి గారితో నువ్వు చేసిన పోరాటం ఏంటి..? మైకు ముందు రెండు మాటలు మాట్లాడితే పోరాటం చేసినట్లా..?

-రాజకీయాల్లో  పవన్‌ కళ్యాణ్‌కి వచ్చిన దిక్కుమాలిన ఖర్మ ఎవరికైనా వస్తుందా..? ఇన్ని సార్లు గోడదూకడం ఎవరి వల్లైనా అవుతుందా..?

-మీటింగుకు వచ్చిన జెండా మోసే కార్యకర్తలో స్థైర్యాన్న నమ్మకాన్ని కలగజేయాల్సిన బాధ్యత నాయకుడిది

-నువ్వు గెలిచినా ఓడినా నీతో ఉంటామని వచ్చిన వారిని నేను మిమ్మల్ని నమ్మడం లేదని చెప్తున్నాడు

-ప్రశ్నించడం నీ ఒక్కవల్లే అవుతుందా..? మేమూ ప్రశ్నించగలం

-నువ్వు అందరినీ బూతులు తిడతావ్‌...నిన్ను మాత్రం సార్‌..ఆయ్యా అనాలా..?

-అంతా బిల్డప్‌ బాబాయ్‌ కాకపోతే పవన్‌ కళ్యాణ్‌ ఎవరితో యుద్ధం చేయలేదు...

తాజా వీడియోలు

Back to Top