ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ జైత్ర‌యాత్ర‌

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను మించి జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జైత్రయాత్ర సాగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారిపై అపార విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లా పరిషత్ లనూ వైయ‌స్సార్‌సీపీ కైవసం చేసుకుందని ట్వీట్ చేశారు.
 
ప్రజల హృదయాల్లో స్థానం ఉంటే ఎన్ని వ్యవస్థలు అడ్డుపడినా ప్రయోజనం ఉండదని ప్రస్తుత ఫలితాలతో ‘వందో సారి’ నిర్థారణ అయింది. ప్రతి మండలంలో వైయ‌స్ జగన్ గారికి జనం  నీరాజనాలు పలికారు. ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం. ఓట్ల లెక్కింపును వాయిదా వేయించగలిగినా ప్రజా తీర్పును మార్చలేరు. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైయ‌స్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయ‌స్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top