ఎన్‌సీపీ నుంచి ఎంత లంచం తీసుకున్నాడో చంద్రబాబు వెంకన్న సన్నిధిలో చెప్పాలి

విశాఖలో మీడియాతో  ఎంపీ విజయసాయి రెడ్డి

బండారు సత్యన్నారాయణ, ఇతర తేదేపా నేతలపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

టీడీపీ నేతలపైనా, పచ్చమీడియా సంస్థలపైనా పరువు నష్టం దావా వేస్తానని ప్రకటన

విశాఖపట్నం : తెలుగుదేశం హయాంలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను అక్రమించుకున్న పచ్చ పార్టీ నేతల నుంచి తిరిగి స్వాదీనం చేసుకొని పేద ప్రజలను, అభివృద్దికి ఉపయోగిస్తున్నందున ఓర్వలేక ఆ పార్టీ నేతలు, పచ్చ కుల మీడియా సంస్థలు వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఉన్న తనపైనా, చివరికి తన కుటుంబ సభ్యులపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమపై భూ ఆక్రమణలు పేరిట బురద చల్లుతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తమ  ప్రతిష్టకు బంగం కల్గించి, తప్పుడు ఆరోపణలు చేసిన తేదేపా నేతలపైనా, మీడియా సంస్థల యజమానులపై పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్ మరికొందరు తెలుగుదేశం నాయకులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పత్రికలు, టివి 5 న్యూస్ ఛానల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసారు. నిజానికి ఎస్ సిసి భూములు వ్యవహారం మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగిందని 2005లో విఎంఆర్ డిఏ, జివిఎంసి విడుదలచేసిన ఆర్ఎఫ్ బిలో మొత్తం ఆరు మంది బిడ్డర్లు పాల్గొన్నారని, అందులో ఎన్ సిసి సంస్థ అత్యధిక మొత్తానికి బిడ్ వేసిందని, రూ 93.20 కోట్లకు బిడ్ వేసిందని అన్నారు. 2005, డిసెంబర్ 31న వారికి అవార్డు చేయబడిందని అన్నారు. 2007 సంవత్సరంలో అభివృద్ధి రుసుము, వడ్డీతో కలిపి మొత్తం 95 కోట్లు సంస్థ చెల్లించడం జరిగిందని అన్నారు.

 మధురవాడ ఐటి సెజ్ సమీపంలో మొత్తం 97 ఎకరాలలో 33 ఎకరాలు నివాసిత స్థలం, 15 ఎకరాలు కొండ ప్రాంతం, 50 ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉందని అన్నారు. భూమి ఉపయోగాన్ని మార్చుకునేందుకు వారికి 2014 వరకు పట్టిందని అన్నారు. అంతకు ముందు 2012 లో ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందని అన్నారు. విజిలెన్స్ విచారణ తరువాత సంస్థకు నోటీసులు ఇచ్చి అడ్వకేట్ జనరల్ సూచనలతో 2013 రద్దు చేయడం జరిగిందని అన్నారు. డబ్బులు కట్టించుకొని రద్దు చేసినందుకు ఎన్ సిసి సంస్థ 2013 చివరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, దీంతో కోర్టు 2014 మార్చిలో స్టేటస్కో ఆర్డర్ చేసిందని అన్నారు. 2016లో సంస్థ ఈ భూములను ఫ్రీ హోల్డ్ లాండ్ గా మార్చాలని అభ్యర్థించింది, రెవెన్యూ పంపకంలో  3.5 శాతం భూమి నివాసిత ప్రదేశంగా, 4 శాతం భూమి వాణిజ్య పరంగా ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించాలని, లేని పక్షంలో 12 శాతం వడ్డీతో తాము చెల్లించిన సొమ్ము వాపస్ చేయాలని కోరారు. దీంతో రివైజ్డ్ అగ్రిమెంట్ చేయాలని సంస్థ కండిషన్ పెట్టిందని అన్నారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు.

అనంతరం ఆ భూమిని కేబినెట్ లో ఆమోదించి 2019 ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గా మార్చాడని అన్నారు. 2019లో క్యాబినెట్ రద్దయినప్పటికీ ఎన్ సిసి సంస్థ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశారు.  121 ఎంఏయుడి జిఓ సంస్థకు అనుకూలంగా విడుదల చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.14 కోట్ల ఆదాయం గండిపడిందని అన్నారు. జిపిఏ చేసేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వానికి ఖజానాకు 50 కోట్లు నష్టం కలిగిందని అన్నారు. ఆ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఎంత లంచం తీసుకున్నాడో చెప్పాలని, తిరుపతి వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేసారు. అనంతరం ఏర్పడిన వైకాపా ప్రభుత్వం జిపిఏ కుదరదంటూ దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వస్తుందని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తీర్మానించింది. ఒక కమిటీ ఏర్పాటు చేసి భూమి విలువ అంచనా వేసి రిపోర్టు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని అన్నారు. డ్రాఫ్ట్ సెల్ డీడ్ ను జివిఎంసికి, లా డిపార్ట్ మెంట్ కు పంపడం జరిగిందని, 2021 ఆగస్టులో దానికి ఆమోదించడం జరిగిందని అన్నారు. మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు, అభివృద్ధి చార్జీలు కలిపి రూ 187.97 కోట్లు మీద చార్జీలు వసూలు చేయడం జరిగిందని అన్నారు.

విశాఖపట్నంలో చంద్రబాబు సామాజిక వర్గానికి 85శాతం ల్యాండ్ బ్యాంక్ ఉందని అన్నారు. చంద్రబాబు 2014-19 సంవత్సరాల మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా 7లక్షల కోట్ల విదేశాలకు తరలించాడని అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైకాపా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్రంలోని 26 రాష్ట్రాల్లో ఎక్కడ భూ ఆక్రమణ చేసినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు, అతని కుమారులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, 30-40 బినామీ కంపెనీలు నడుపుతున్నాడని, వీటిపై ఈడికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఎన్ సిసి వారు జిఆర్ పి ఎల్ కంపెనీ తో అగ్రిమెంట్ చేసుకున్నారని, ఆ కంపెనీ గంటా శ్రీనివాస్ కు స్నేహితుడని, తన కుటుంబంతో ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫిలింసిటీని రామోజీరావు నిర్మించాడని, ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ విషయం అందరికీ తెలిసిందేనని, సుజనా చౌదరి ఆర్థిక నేరగాడని వీరు తమ పై బురదజల్లుడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అందరి బండారాలు బయటపెడతానని ఏ ఒక్కరినీ వదిలేదని లేదని అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు గాజువాక ఎంఎల్ఏ నాగిరెడ్డి, ఎంఎల్సి వంశీ, ఉత్తర నియోజ కవర్గ సమన్వయ కర్త కేకేరాజు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఉన్నారు.

తెలుగుదేశం హయాంలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను అక్రమించుకున్న పచ్చ పార్టీ నేతల నుంచి తిరిగి స్వాదీనం చేసుకొని పేద ప్రజలను, అభివృద్దికి ఉపయోగిస్తున్నందున ఓర్వలేక ఆ పార్టీ నేతలు, పచ్చ కుల మీడియా సంస్థలు వైకాపా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఉన్న తనపైనా, చివరికి తన కుటుంబ సభ్యులపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమపై భూ ఆక్రమణలు పేరిట బురద చల్లుతున్నారని రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తమ  ప్రతిష్టకు బంగం కల్గించి, తప్పుడు ఆరోపణలు చేసిన తేదేపా నేతలపైనా, మీడియా సంస్థల యజమానులపై పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్ మరికొందరు తెలుగుదేశం నాయకులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పత్రికలు, టివీ 5 న్యూస్ ఛానల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసారు.

నిజానికి ఎస్ సిసి భూములు వ్యవహారం మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగిందని 2005లో విఎంఆర్ డిఏ, జివిఎంసి విడుదలచేసిన ఆర్ఎఫ్ బిలో మొత్తం ఆరు మంది బిడ్డర్లు పాల్గొన్నారని, అందులో ఎన్ సిసి సంస్థ అత్యధిక మొత్తానికి బిడ్ వేసిందని, రూ 93.20 కోట్లకు బిడ్ వేసిందని అన్నారు. 2005, డిసెంబర్ 31న వారికి అవార్డు చేయబడిందని అన్నారు. 2007 సంవత్సరంలో అభివృద్ధి రుసుము, వడ్డీతో కలిపి మొత్తం 95 కోట్లు సంస్థ చెల్లించడం జరిగిందని అన్నారు.  మధురవాడ ఐటి సెజ్ సమీపంలో మొత్తం 97 ఎకరాలలో 33 ఎకరాలు నివాసిత స్థలం, 15 ఎకరాలు కొండ ప్రాంతం, 50 ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉందని అన్నారు. భూమి ఉపయోగాన్ని మార్చుకునేందుకు వారికి 2014 వరకు పట్టిందని అన్నారు. అంతకు ముందు 2012 లో ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందని అన్నారు. విజిలెన్స్ విచారణ తరువాత సంస్థకు నోటీసులు ఇచ్చి అడ్వకేట్ జనరల్ సూచనలతో 2013 రద్దు చేయడం జరిగిందని అన్నారు. డబ్బులు కట్టించుకొని రద్దు చేసినందుకు ఎన్ సిసి సంస్థ 2013 చివరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, దీంతో కోర్టు 2014 మార్చిలో స్టేటస్కో ఆర్డర్ చేసిందని అన్నారు.

2016లో సంస్థ ఈ భూములను ఫ్రీ హోల్డ్ లాండ్ గా మార్చాలని అభ్యర్థించింది, రెవెన్యూ పంపకంలో  3.5 శాతం భూమి నివాసిత ప్రదేశంగా, 4 శాతం భూమి వాణిజ్య పరంగా ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించాలని, లేని పక్షంలో 12 శాతం వడ్డీతో తాము చెల్లించిన సొమ్ము వాపస్ చేయాలని కోరారు. దీంతో రివైజ్డ్ అగ్రిమెంట్ చేయాలని సంస్థ కండిషన్ పెట్టిందని అన్నారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. అనంతరం ఆ భూమిని కేబినెట్ లో ఆమోదించి 2019 ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గా మార్చాడని అన్నారు. 2019లో క్యాబినెట్ రద్దయినప్పటికీ ఎన్ సిసి సంస్థ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశారు.  121 ఎంఏయుడి జిఓ సంస్థకు అనుకూలంగా విడుదల చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.14 కోట్ల ఆదాయం గండిపడిందని అన్నారు. జిపిఏ చేసేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వానికి ఖజానాకు 50 కోట్లు నష్టం కలిగిందని అన్నారు. ఆ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఎంత లంచం తీసుకున్నాడో చెప్పాలని, తిరుపతి వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేసారు. అనంతరం ఏర్పడిన వైకాపా ప్రభుత్వం జిపిఏ కుదరదంటూ దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వస్తుందని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తీర్మానించింది. ఒక కమిటీ ఏర్పాటు చేసి భూమి విలువ అంచనా వేసి రిపోర్టు ఇవ్వాలని వైయస్ జగన్  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని అన్నారు. డ్రాఫ్ట్ సెల్ డీడ్ ను జివిఎంసికి, లా డిపార్ట్ మెంట్ కు పంపడం జరిగిందని, 2021 ఆగస్టులో దానికి ఆమోదించడం జరిగిందని అన్నారు. మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు, అభివృద్ధి చార్జీలు కలిపి రూ 187.97 కోట్లు మీద చార్జీలు వసూలు చేయడం జరిగిందని అన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు సామాజిక వర్గానికి 85శాతం ల్యాండ్ బ్యాంక్ ఉందని అన్నారు. చంద్రబాబు 2014-19 సంవత్సరాల మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా 7లక్షల కోట్ల విదేశాలకు తరలించాడని అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్రంలోని 26 రాష్ట్రాల్లో ఎక్కడ భూ ఆక్రమణ చేసినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు, అతని కుమారులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, 30-40 బినామీ కంపెనీలు నడుపుతున్నాడని, వీటిపై ఈడికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఎన్ సిసి వారు జిఆర్ పి ఎల్ కంపెనీ తో అగ్రిమెంట్ చేసుకున్నారని, ఆ కంపెనీ గంటా శ్రీనివాస్ కు స్నేహితుడని, తన కుటుంబంతో ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫిలింసిటీని రామోజీరావు నిర్మించాడని, ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ విషయం అందరికీ తెలిసిందేనని, సుజనా చౌదరి ఆర్థిక నేరగాడని వీరు తమ పై బురదజల్లుడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అందరి బండారాలు బయటపెడతానని ఏ ఒక్కరినీ వదిలేదని లేదని అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు గాజువాక ఎంఎల్ఏ నాగిరెడ్డి, ఎంఎల్సి వంశీ, ఉత్తర నియోజ కవర్గ సమన్వయ కర్త కేకేరాజు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఉన్నారు. 

Back to Top