అచ్చెన్నాయుడు ఓ రౌడీ..గూండా.. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి

వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్  

 చంద్రబాబు వల్ల నష్టపోయిన వ్యక్తే తిరుపతిలో రాయి విసిరాడు

అదే వ్యక్తి ఈరోజు అచ్చెన్నాయుడిని తాజ్‌ హోటల్లో కలిశాడు

17 తరువాత పార్టీనా, బొక్కా అని ఆ వ్యక్తితో అచ్చెన్నాయుడు అన్నాడు

ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
రామ్మెహన్‌ నాయుడు ఒక చేతకాని ఎంపీ  

  తిరుపతి:  టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఓ రౌడీ..గుండా , హ‌త్యా రాజ‌కీయాలు చేసే వ్య‌క్తి అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు (మంగళవారం) ఒక వ్యక్తి అచ్చెన్నాయుడి వద్దకు వెళ్ళి మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు... నిన్న (సోమవారం) చంద్రబాబుపై రాయి విసిరిన వ్యక్తి. ట్రెండ్‌సెట్‌ బిల్డర్స్‌లో సదరు వ్యక్తి రూ.1200 కోట్ల వ్యవహారంలో మధ్యవర్తిగా వున్నాడు. ట్రెండ్‌ సెట్‌ బిల్డర్స్‌ కెఎల్‌ నారాయణ చంద్రబాబుకు బినామీ. ఈ వ్యవహారంలో సదరు వ్యక్తికి రూ.6 కోట్లు రావాల్సి ఉంది. ఆ డబ్బుకు చంద్రబాబు భరోసా ఇచ్చాడు. అయితే ఎన్నిసార్లు తిరిగినా డబ్బు రాకపోవడం, చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడంతో సదరు వ్యక్తి ఆగ్రహంతో వున్నాడు. సోమవారం తిరుపతి సభలో సదరు వ్యక్తి చంద్రబాబుపై రాయి విసిరి, తన షర్ట్‌ కూడా చింపుకుని కేకలు వేశాడు. తిరుప‌తి ప్రెస్ క్ల‌బ్‌లో దువ్వాడ శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు.

– అదే వ్యక్తి ఈరోజు తాజ్‌ హోటల్‌లో అచ్చెన్నాయుడిని కలిశాడు. ఈ సందర్బంగా ఆ వ్యక్తి తన గోడును అచ్చెన్నాయుడి వద్ద వెళ్ళబోసుకున్న సందర్బంలో ఆయన ఒక రకంగా నిస్సహాయత వ్యక్తం చేశాడు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడు ఈనెల 17 తరువాత పార్టీనా.. బొక్కా అంటూ సొంత పార్టీపైనే నీచంగా మాట్లాడాడు. లోకేష్‌ వల్లే ఈ కష్టాలు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి తాను చేసిన వ్యాఖ్యలు కావని అచ్చెన్నాయుడు చెప్పగలడా? 

– తనపై రాళ్ళు విసిరారు అంటూ చంద్రబాబు తిరుపతిలో డ్రామా చేశాడు. ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు ఈ నాటకానికి తెర తీశారు. చంద్రబాబుపై రాళ్లు వేయించాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? రాళ్లు వేయించుకోవాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? రాళ్ల దాడి జరిగిందని సానుభూతి సంపాదించుకోవాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? గెలిచే అవకాశమే లేని స్థితిలో చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయం ఇది. ఇంతగా దిగజారినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. అంత హడావుడిగా నేరుగా పోలీసుల మీద చంద్రబాబు ఆరోపణలు చేశారు. పోలీసుల ప్రోద్భలంతోనే రాళ్లు వేశారని అన్నారు. అప్పటికప్పుడు చంద్రబాబు ఏ ప్రాతిపదికన ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో సీఎం గారి మీద ఆరోపణలు చేశారు. రాళ్ల దాడి జరిగితే ఎవరు గాయపడ్డారు? గాయపడిన వారే లేకుండా.. రాళ్ల దాడి జరిగిందని ఎందుకు డ్రామా ఆడారు? 

– అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడుగా వుండి ఆ పార్టీనే తూలనాడిన అచ్చెన్నాయుడు టిడిపికి ఓటు వేయాలని ప్రజలను ఎలా అడుగుతున్నాడు? వారి నీచ రాజకీయాలు బయటకు వచ్చాయి. టిడిపికి ఓట్లు వేయాల్సిన అసవరం లేదని అచ్చెన్నాయుడు అంగీకరిస్తున్నాడా? తమ పార్టీ అడ్రస్‌ లేకుండా పోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అంటున్నాడు. 

– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచాయి. జగన్‌ గారు సీఎం అయిన తరువాత దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని పద్దతిలో రాజకీయలు, కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అర్హత వున్న వారికి అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సీఎంకు జన నీరాజనాలు పలుకుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొంబై శాతం గెలిచాం. మున్సిపల్, కార్పోరేషన్‌ ఎన్నికల్లోనూ దాదాపు అదే స్థాయిలో గెల్చాం. అందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాలనే కారణం.

– పంజాబ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఎపిలో జరుగుతున్న పథకాలను పరిశీలించేందుకు వస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ తరహా పాలనను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాబోతున్నాయి. తిరుపతి ఎన్నికల్లో ఓడిపోతున్నాం, అడ్రస్‌ లేకుండా పోతున్నామనే భయంతో టిడిపి ఏదో ఒకటి చేసి కొన్ని ఓట్లు అయినా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.

– చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారు. దళితులను అవమానించడం చంద్రబాబుకు అలవాటు. ఎవరైనా దళితుడిగా పుట్టాలి అనుకుంటారా? అని ఆనాడు అన్నాడు. జగన్‌ గారు తన పాలనలోనూ, తన కేబినెట్‌లోనూ వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. వెనుకబడిన కులాలకు అగ్రస్థానం కల్పించిన ఘనత వైయస్‌ జగన్‌ గారిది. 1983లో ప్రారంభమైన టిడిపి ఏనాడైనా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసిందా? ఆ మహనీయుడిని ఏనాడైనా కొనియాడిందా? ఇప్పుడు పూలే గుర్తుకు వచ్చారా? 

– చంద్రబాబాబుకు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు  నక్కకీ, నాక లోకానికి వున్నంత తేడా వుంది. చంద్రబాబు ఒక ఔరంగజేబు అని, ద్రోహి అని ఆనాడే ఎన్టీఆర్‌ చెప్పారు. చంద్రబాబు చేసిన ద్రోహానికి ఎన్టీఆర్‌ ఆకస్మిక మరణం చెందారు. తిరుపతిలో టిడిపి నేతలు మాట్లాడే తీరు చూస్తుంటే దిజగారుడు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయి. 
 
– శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజ్యాంగ పదవిలో వున్న గవర్నర్‌ను గంగిరెద్దు అంటూ దూషించాడు. జిల్లా ఎస్పీని యూస్‌లెస్‌ ఫెలో అంటూ మాట్లాడాడు. ఆయన ఒక రౌడీ, గూండా, మహిళలను వేధించే కీచకుడు. ఇటువంటి వ్యక్తిని దున్నపోతు అని అంటే తప్పేమిటీ? తన అన్న ఎర్రన్నాయుడితో కలిసి హత్యా రాజకీయాలు చేశాడు. సొంత తమ్ముడినే రాజకీయాల కోసం అర్థరాత్రి చంపిన మాట వాస్తవం కాదని ఈ పవిత్ర తిరుపతిలో వుండి చెప్పగలవా అచ్చెన్నాయుడు?

– అచ్చెన్నాయుడి అరాచకాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దమ్మంటే బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్‌ చేస్తున్నాను. మరణించిన ఎర్రన్నాయుడు, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు మరెవ్వరూ తిట్టనంతగా చంద్రబాబును దూషించారు. ఈ రోజు తాజాగా ఒక వ్యక్తితో తెలుగుదేశం పని అయిపోయిందని రాష్ట్ర అధ్యక్షుడుగా వుంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు. లోకేష్‌ వల్లే ఈ దుస్థితి వచ్చిందని అన్నాడు. లోకేష్‌ సరిగా వుంటే మనకీ కష్టాలు ఎందుకు వస్తాయని అన్నాడు.

– చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌. వెనుకబడిన వర్గాలను వెన్నుతట్టి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ఆయన. ఈ రాష్ట్రంలో అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా వున్నారు. తిరుపతి ప్రజలు దాదాపు అయిదు లక్షల మెజార్టీతో గురుమూర్తిని గెలిపిస్తారనే నమ్మకం వుంది. తెలుగుదేశం పార్టీ కూడా దానిని అంగీకరిస్తోంది. 

– అచ్చెన్నాయుడు, రామ్మెహన్‌నాయుడు రంకెలు వేసి మాట్లాడుతున్నారు. రామ్మెహన్‌ నాయుడు చేత కాని ఎంపి. ఏడాదికి అయిదు కోట్లు వచ్చే ఎంపీ లాడ్స్‌కు కనీసం ప్రతిపాదనలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఎనబై శాతం నిధులు వెనక్కి పోయాయి. పనికి మాలిన ఈ ఎంపీ మాకు వుండటం మా దురదృష్టం. శ్రీకాకుళంలో ఏ గ్రామానికి వెళ్ళి ప్రజల కష్టాలను ఆయన పట్టించుకోలేదు. ఈ రోజు చిత్తూరులో మైకుల ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. మీరు చేసిన అక్రమాలను బయటపెడుతున్నాను. మీకు దమ్ముంటే.. నేను చేసే ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ చేస్తున్నాను. రేపు తిరుపతి ఎన్నికల ఫలితాలను రెఫరెండం అని మేం చెబుతున్నాం. మరి మీరు అంగీకరిస్తారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం

Back to Top