ప‌ట్టాభి వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి

2వ రోజు జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ నేత ప‌ట్టాభి చేసిన బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు వైఖ‌రిని నిర‌సిస్తూ మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజు వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అల‌జ‌డులు సృష్టించ‌డానికి చంద్ర‌బాబు కుట్ర‌ చేస్తున్నాడ‌ని ఎమ్మెల్యే మండిప‌డ్డారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిష్ట‌పాలు చేయాల‌నే కుతంత్రంలో భాగంగానే చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాల‌కు తెర‌లేపాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top