అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు 

జనాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే శ్రీ‌దేవి
 

క‌ర్నూలు:  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి మండిపడ్డారు.   పత్తికొండ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రెండోరోజు  జనాగ్రహ దీక్ష కొన‌సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన దానికి బాధ్య‌త వ‌హిస్తూ చంద్ర‌బాబు వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండు చేశారు. కార్య‌క్ర‌మంలో కెడిసిసి బ్యాంక్ మాజీ ఛైర్మెన్ ఎస్. రామ చంద్ర రెడ్డి ,  పత్తికొండ, వెల్దుర్తి, తుగ్గలి, కృష్ణగిరి మండలాల జెడ్పీటీసీ సభ్యులు ఉరుకుందమ్మ , సుంకన్న , పులికొండ నాయక్  , కెఈ సుభాషిని, ఎంపీపీలు డాక్టర్ కంగాటి వెంకట్ రామ్ రెడ్డి , డి.అనిత, అదెమ్మ,  పత్తికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కటారుకొండ మాధవరావు , కృష్ణగిరి సింగిల్ విండో ప్రెసిడెంట్  కంభాలపాడు  బ్రహ్మా నందరెడ్డి, వైస్ ఎంపీపీ లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కో ఆప్షన్ మెంబర్లు, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top