వివక్షరహిత పాలన అందించడమే మా ప్ర‌భుత్వ ల‌క్ష‌ణం 

స‌చివాల‌య‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌తో పేద‌ల‌కు మేలు

తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబు ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి

అసెంబ్లీ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ చేస్తున్నవిధంగా గొప్ప పాలన చేశాం అని చెప్పుకునే సమర్థత లేక తప్పుడు వార్తలతో, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి ధ్వ‌జ‌మెత్తారు. తెలుగుదేశం పార్టీ గబ్బుపట్టిపోయింది.. తెలుగు దేశం పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ.. అని నేడు రాష్ట్ర ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చార‌న్నారు. వివక్షరహిత పాలన అందించడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో ఉన్న గొప్ప లక్షణమ‌న్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి మాట్లాడారు. 

చంద్రబాబు 14ఏళ్ల పాలనలో వ్యవస్థను ప్రైవేటుపరం చేయడానికి, వ్యాపారులకు లబ్ది చేకూర్చడానికి సంస్కరణలు తెచ్చాడు తప్ప పేద ప్రజల కోసం ఏ సంస్కరణలనూ తేలేదు. వాటినే గొప్ప సంస్కరణలని, తానో పెద్ద సంస్కరణవాదిని అని చెప్పుకుంటాడు. వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదల కోసమే సంస్కరణలు తెచ్చింది. సచివాలయం, ఆర్బీకే, వైయ‌స్సార్ క్లినిక్, వలంటీర్ల‌ వ్యవస్థలన్నీ వారికోసమే. వీటివల్ల వ్యాపారులకు, పెట్టుబడిదారులకు మేలు ఉండదు. రాజకీయ దళారుల చేతిలో పేద ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయి. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను దేశ ప్ర‌ధాని ప్ర‌శంసించారు.  

ఏ ప్రభుత్వానికైనా ఆర్థికాభివృద్ధికి కొలబద్ద తలసరి ఆదాయం (GSDP). నేడు ఈనాడులో గవర్నర్ రిసీవింగ్ గురించి తప్పుడు వార్తలు రాసినట్టే ఈ రాష్ట్రం దివాళా తీసింది, శ్రీలంకలా మారిపోయింది అంటూ అసత్య వార్తలు పుంఖానుపుంఖాలు రాస్తున్నారు. మన ప్రభుత్వంలో 2021-22లో తలసరి ఆదాయం 1,92,517 నుండి  2,19,518కు పెరిగింది. అంటే 14.02% కి వృద్ధి రేటు పెరిగింది. GSDP 2022-23 లో 7,54,338 కోట్లు ఉంటే 2021-22లో 7,04,809 కోట్లు. గ్రోత్ 7% గ్రోత్ రేట్ 11.23%. భారత దేశ GSDP గ్రోత్ రేట్ 7% ఉండగా రాష్ట్ర GSDP 11.23%. ఈ ప్రభుత్వ పాలనను కించపరుస్తూ మాట్లాడే ప్రతిపక్షలు, టీడీపీ ఈ లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. 

ఐదేళ్ల పాలనలో అద్భుతాలేవో చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు హయాంలో 2018-19లో  వ్యవసాయ వృద్ధి రేటు 3.54% ఉంటే వైయ‌స్‌ జగన్ హయాంలో 2021-22లో 9.24% కు చేరింది. ఇది వైయ‌స్‌ జగన్ పాలనా దక్షత. ఇండస్ట్రీలన్నీ నన్ను చూసి పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పుకునే టీడీపీ పాలనలో 2018-19లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 3.17% ఉంటే వైయ‌స్ జగన్ హయాంలో 2022-23లో 5.66%. ఆలిండియా గ్రోత్ రేట్ చూసినా 3.6% మాత్రమే ఉంది. 
 
రాష్ట్రం అప్పులో మునిగిపోతోందంటూ టీడీపీ, ఎల్లో మీడియాల దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక్కసారి అప్పుల లెక్కలేంటో చూస్తే.. రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీ అప్పు - 1,13,797 కోట్లు. చంద్ర‌బాబు దిగిపోయేటప్పుడు 2,71,797 కోట్లు. అంటే 138.84% పెరిగింది. వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ 4,42,442 కోట్ల అప్పు ఉంది. అంటే 62% అప్పులో పెరుగుదల. ఇదే ఏడాది సగటు తీసుకుంటే 13.55% మాత్రమే అప్పులో పెరుగుదల ఉందని తెలుస్తోంది. స్వయంగా ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. అంతే కాదు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లకు రక్షణ లభించింది అనికూడా ఆర్‌బీఐ తన నివేదికలో ప్రశంసించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేపిటల్ ఎక్స్పెండిచర్ ఏదీ చేయడం లేదని, ఆస్తుల కల్పన చేయడం లేదని ప్ర‌తిప‌క్షం త‌ప్పుడు ప్రచారం చేస్తోంది`` అని ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి ధ్వ‌జ‌మెత్తారు. 

తాజా వీడియోలు

Back to Top