సామాన్యులను దృష్టిలో ఉంచుకొనే సినిమా టికెట్ల ధరపై నిర్ణయం 

మంత్రి అవంతి శ్రీ‌నివాస్

విశాఖ: సినిమా టికెట్ల ధరపై సామాన్యులను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ తెలిపారు. జనసేనాని పవన్‌కల్యాణ్ సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని  ప్రకటించారు. సినిమాలు చూసి ..ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. కరోనా కారణంగానే సీఎం వైయ‌స్ జగన్ తిరుపతి సభ రద్దు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వైయ‌స్ జగన్‌కి సవాల్ విసిరే స్థాయి లోకేష్‌కు లేదని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

Back to Top