ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవండి

కార్యకర్తలు, నాయకులకు వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ పిలుపు

సామాజిక దూరం పాటిస్తూనే.. ప్రజలను అప్రమత్తం చేయండి

తాడేపల్లి: కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వారధిగా నిలవాలని వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ.. పార్టీ నాయకులు, బూత్ స్థాయి క్రియాశీలక కార్యకర్తలకు వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. 'ఈ మహమ్మారి వైరస్‌ను అరికట్టేందుకు.. స్వీయ సామాజిక దూరం పాటిస్తూనే... మీ ప్రాంతాల్లో మీ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి-ప్రజలకు వారధిగా నిలవాలని మార్గదర్శకం చేశారు. బూత్ స్థాయి పార్టీ క్రియాశీలక కార్యకర్తల నుంచి.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్ణీత బాధ్యతలను అప్పగించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మీవంతుగా ఒకవైపు చర్యలు చేపడుతూనే.. మరోవైపు ప్రజల్లో ధైర్యం నెలకొల్పాలని పార్టీ శ్రేణులకు వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

విధిగా స్వీయ సామాజిక దూరం పాటిస్తూనే.. గుంపులు గుంపులుగా సంచరించకుండా ప్రజలను అప్రమత్తం చేయడం.. మీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది గమనించటం... లోపాలుంటే అధికారుల దృష్టికి వెంటనే తేవటం... అధికారులతో సమన్వయం చేసుకుని అందరికీ నిత్యావసరాలు అందేలా చూడటం... ఇదే అదునుగా మార్కెట్‌లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం.. అనాథలు, అన్నార్తులకు ఆహార సదుపాయాలు కల్పించడం, అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేయడం.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం రాకుండా చూడటం... వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో రైతుకు మేలు జరిగేలా చూడటం... వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించడం.. ప్రభుత్వ ఆదేశానుసారం విధిగా ఏప్రిల్ 14 వరకు ఇంటికే పరిమితమయ్యేలా ప్రజలను చైతన్యపరచడం.. తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు.

తాజా వీడియోలు

Back to Top