విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ కమిటీతో సీఎం సమీక్షా

తాడేపల్లి: పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కమిటీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పేదరికం చదువుకు అడ్డకాకూడదని, పేద కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగాలంటే చదువు అవసరమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్, జగన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇంగ్లిష్‌ మీడియం లోటు భర్తీ చేస్తూ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ విద్యాశాఖకు పెద్దపీట వేశారని, విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో ఎక్కవ నిధులు కేటాయించారన్నారు. 
 

Back to Top