విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు చదువు కూడా ముఖ్యమే 

మంత్రి ఆదిమూలపు సురేశ్

తాడేప‌ల్లి: విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువు కూడా ముఖ్యమేనని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు మొత్తం 11 పేప‌ర్లు ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో తాము వాటిని 7కి కుదించామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేస్తుండడం పట్ల మంత్రి ఆదిమూలపు సురేశ్ బదులిచ్చారు. విపక్షాలు పరీక్షల అంశంలో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదో తరగతి పరీక్షలపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీలో విద్యాప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో దేశం మొత్తానికి కనిపిస్తున్నా, టీడీపీ నేతలకు కనిపించకపోవడం శోచనీయం అని మంత్రి వ్యాఖ్యానించారు.

Back to Top