అనుకూల మీడియా మళ్లీ బాబు పల్లకీసేవ మొదలెట్టింది

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
 

 

హైదరాబాద్‌: చంద్రబాబు అనుకూల మీడియా మళ్లీ బాబు పల్లకీ సేవా మొదలుపెట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. నదీ పరిరక్షణ చట్టం – 1884, ఎన్జీటీ, సీఆర్‌డీఏ నిబంధనలు నదిని పూడ్చి చంద్రబాబు నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయన్నారు. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలన్నారు. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం రూ. 9 కోట్ల బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయని, ప్రజావేదిక గణేష్‌ మండపానికి ఎక్కువ.. కోళ్ల షెడ్డుకు తక్కువ అని సోషల్‌ మీడియాలో యువత కామెంట్లు పెడుతున్నారని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top