మాటతప్పని, మడమ తిప్పని నేత వైయ‌స్ఆర్‌

రేపు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 75వ జ‌యంతి 

తెలుగు జాతి గర్విస్తున్న ఓటమి ఎరుగని నాయకుడు, మాట తప్పని, మడమ తిప్పని యోధుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి. రాష్ట్ర సమాగ్రాభివృద్ధే ధ్యేయంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసి పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం దిశగా దేశంలో ఏ ముఖ్యమంత్రి పాలన చేయని రీతిలో ఒక్క రూపాయి కొత్త పన్ను విధించకుండా, ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పాలన గావించారు. అభివృద్ధితో ఏర్పాటువాదాన్ని నిరోధించి రాష్ట్రలో మారు మూల ప్రాంత వ్యవసాయ కార్మికుని నుంచి మేథావులు సైతం దేశ ప్రధాని వరకు ఈ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చే ఉండేది కానది అభిప్రాయపడుతున్నారు. వైయస్‌ఆర్‌ కోరుకున్న హరితాంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మహానేత తనయుడు వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాకిరణంగా మారారు.

 
దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకంగా మన రాష్ట్రం. వ్యవసాయాధారిత రాష్ట్రం. ఈ రాష్ట్రం స్వయం సమృద్ధితో ఉండాలన్నా..గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక విధానం పటిష్టంగా ఉండి తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే..వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, రైతులకు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అవసరం. అలానే సామాన్యునికి ప్రధానంగా కావాలసిన తినడానికి తిండి గింజలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఆరోగ్యానికి వైద్యం, పిల్లలకు విద్య, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత అవసరం. అదేవిధంగా చేనేత కార్మికులకు, కుల వృత్తుల వారికి సరైన ఆదాయం. 2004 నాటికి ఇవన్నీ ఎలా ఉన్నాయి..ఇవే 2009 నాటికి ఏవిధంగా మారాయో పరిశీలించి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు  సవాళ్లు విసరడం, పరనింద చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారింది. అలాకాకుండా ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పాలనలో ఏమి జరిగిందో, వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎలాంటి మార్పులు సంభవించాయో అందరికీ తెలుసు..

2004 నుంచి 2009 వరకు గ్రామాల్లో పరిస్థితి:
2004–2005 నుంచి సకాలంలో వర్షాలు, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల,  ఒడిదుడుకులు లేకుండా పంటల దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల పెంపుతో రైతుల ఆదాయం పెరిగి కూలీలకు డిమాండ్‌ పెరిగి పల్లెల్లో ఆదాయం పెరగడంతో చిన్నవ్యాపారుల వ్యాపారాభివృద్ధి, గణనీయంగా భూమి విలువలు పెరుగుదల, వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సులతో సహకార సంఘాలు మూతపడకుండా కాపాడుట కోసం రూ.2 వేల కోట్ల గ్రాంటుతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆదుకోవడం జరిగింది. గ్రామాల్లో అర్హులైన వారెవ్వరూ కూడా రేషన్‌ కార్డు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు వంటివాటి కోసం ఎవ్వరినీ అభ్యర్థించాల్సిన అవసరం లేకుండా మంజూరు చేసిన మహనీయుడు. పావలా వడ్డీకి రుణాలు ఇప్పించడం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంభన. 2008–2009లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అత్యధిక రికార్డు స్థాయి 204 లక్షల టన్నులు

YSR biopic: Malayalam superstar ...

వ్యవసాయం:
వ్యవసాయం అంటే పండుగ కావాలన్న మహోన్నత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో 2004–2005 నుంచి 2009–2010 వరకు ధాన్యం మద్దతు ధర రూ.450(81.81శాతం),  మొక్కజొన్న రూ.400, జొన్న రూ.400 పెరిగింది. 30 లక్షల  వ్యవసాయ పంపుసెట్లకు గ్రామీణ రైతులకు ఉచిత విద్యుత్, నూతనంగా 2 లక్షల తత్కాల్‌ కనెక్షన్లకు ఉచిత విద్యుత్, యూనిట్‌ రూ.7 నుంచి రూ.8 వరకు కొనుగోలు చేసి కూడా రైతులకు ఉచిత విద్యుత్, గ్రామీణ రైతులకు విద్యుత్‌ బకాయిలు రూ.1250 కోట్లు రద్దు. విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదలపై నియంత్రణకు వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రాముఖ్యత. పశుక్రాంతి పథకం ద్వారా పాడి పరిశ్రమాభివృద్ధి, రైతు మిత్ర గూపులకు స్పల్ప వడ్డీ రుణాలు.

ఆహారం:
క్వింటాల్‌ ధాన్యం రూ.1,000 అయిన తరువాత కూడా కోట్ల కుటుంబాలకు పైగా రూ.2 కిలో బియ్యం అందించిన ధీశాలి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి. తన పాలనా కాలంలో 68 లక్షల కుటుంబాలకు నూతన తెల్లకార్డులు మంజూరు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. 2009–2010లో 187 లక్షల తెల్లకార్డులు, 15 లక్షల పైగా అంత్యోదయ కార్డులు రాష్ట్రంలో ఉన్నాయి. బియ్యంపై 2004–05లో రూ.500 కోట్ల సబ్సిడీ, 2009–10లో రూ.3200 కోట్ల సబ్సిడీ అందజేశారు.

గూడు–పేదలకు పక్కా ఇల్లు:
గుడిసె లేని రాష్ట్రం–అదే ఇందిరమ్మ రాజ్యం అన్న నినాదంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన సాగించారు. దేశం మొత్తం మీద ఎన్ని ఇళ్ల నిర్మాణం ఆ కాలంలో జరిగితే ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే అన్ని ఇళ్ల నిర్మాణం వైయస్‌ఆర్‌ చేపట్టారు. 40 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. అంతిమ లక్ష్యం 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే మహానేత అకాల మరణం పొందారు.

YS Rajasekhara Reddy - YSR HD Images | Dr.YSR Wallpapers | Hd photos free  download, New images hd, Watercolor wallpaper iphone

వైద్యం:
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎప్పుడూ జరగని రీతిలో విడుదల. ఊహకు అందని విధంగా 108 అంబులెన్స్‌ సర్వీసు, 104 వైద్యసేవల సర్వీసు ద్వారా గ్రామీణ పేదలకు నెల నెలా మందుల పంపిణీ. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు విశిష్ట వైద్య సదుపాయాలు కల్పించారు.

వృద్దాప్యంలో భద్రత:
వృద్ధుల పింఛన్‌ రూ.75 నుంచి రూ.200, వికలాంగులకు రూ.500 వరకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే. కొత్తవారికి 52.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల మొత్తం 77 లక్షల మందికి ప్రతి నెల1వ తేదీనే బట్వాడా చేశారు. మహిళల సంక్షేమం కోసం అభయ హస్తం పథకం రూపకల్పన చేశారు.

విద్య:
బీసీ విద్యార్థులకు ఏడాదికి రూ.2500 చొప్పున ఉపకార వేతనాలు మంజూరు చేసి, దానిని రూ.3200లకు పెంచారు దివంగత మహానేత వైయస్‌రాజశేఖరరెడ్డి. గణనీయంగా విద్యాలయాలు పెంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఉన్నత విద్యను గ్రామీణ, పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

రైతులకు, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం:
18 సంవత్సరాల తరువాత కేంద్రం ప్రకటించిన రుణాల రద్దు పథకం రెగ్యులర్‌గా కట్టే రైతులకు వర్తించలేదని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు గుర్తించకముందే 36 లక్షల మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.1800 కోట్ల మేర రుణాల రాయితీ దేశంలోనే ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి. 2004 మే 2వ వారంలో అధికారంలోకి వస్తే జూన్‌ 1వ తేదీన ఆత్యహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం అందించే ందుకు జీవో నంబరు 421 విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కూడా పరిహారం విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు యూనిఫారమ్స్‌ రెండు జతల నుంచి నాలుగు జతలకు పెంచారు. ప్రభుత్వ కార్పొరేషన్లు అన్నింటికీ చేనేత బట్టలు వాడాలని నిర్ణయించారు. దీంతో ఆప్కో కొనుగోలు రూ. 4 కోట్ల నుంచి రూ.147 కోట్లకు పెంచి చేనేత కార్మికులకు ఆసరా కల్పించారు. చేనేత కార్మికుల వృద్దాప్య పింఛన్‌ వయస్సు అర్హత 60 నుంచి 50 సంవత్సరాలకు తగ్గించారు. 2008–09లో 80 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు పంట రుణాలు మంజూరు చేయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.70 వేల కోట్ల రుణాలు రద్దుతో రూ.15 వేల కోట్లు మన రాష్ట్ర రైతాంగానికి లబ్ధిచేకూరింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1500 నుంచి రూ.4500కు పెంచారు.

Why is Dr. Y. S. Rajashekara Reddy so loved by the Telugus even today? -  Quora

డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ:
మెట్టప్రాంత రైతులు, కరువు జిల్లాల రైతులు డ్రిప్‌ వాడుకునేవారు. వీళ్లకు 75 శాతం ఇస్తే..మిగిలిన 25 శాతం పెట్టుబడికి కూడా ఇబ్బంది పడతారని 90 శాతం సబ్సిడీ ఇచ్చిన మనవతావాది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి.

వ్యవసాయ విద్యుత్‌:
ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు అయ్యే భూమికంటే భూగర్భ జలాల నుంచి విద్యుత్‌ మోటార్ల ద్వారా సాగు ఎక్కువ. ఒక ఎకరం సాగు ద్వారా 50 నుంచి 60 మందికి ఉపాధి కల్పిస్తున్నారు రైతులు. ప్రభుత్వానికి రూ.4 నుంచి రూ.6 వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు ఖర్చులు, మోటార్‌ ఖర్చు రైతులు భరించడమే కాక ఇవి విఫలమైతే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇది సబ్సిడీ పథకం కాదు.ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటిని ఉచిత నీరు అనడం లేదు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పటిష్టతకు వ్యవసాయానికి విద్యుత్‌ అవసరమని ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, రూ.1269 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు రద్దు చేశారు. తాను చనిపోయే వరకు 7 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చిన మహనీయుడు వైయస్‌ఆర్‌.

విత్తన ధరలు:
బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.750 వంతున మోన్‌శాంటో కంపెనీ అమ్ముతుంటే చట్టపరంగా పోరాడి రూ.650 తగ్గించి ఆంధ్ర ప్రదేశ్‌ రైతులకు సాలీన రూ.1000 కోట్లు ఆదాయమే కాకుండా దేశంలోని రైతులందరికీ ఉపయోగపడింది. సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందించారు.

కృష్ణా నది జలాల వినియోగం:
రాష్ట్రంలో ప్రాజెక్టుల అవసరం, సాగునీటి అవసరం గుర్తించిన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా పులిచింతల, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీలను జలయజ్ఞంతో మొదలుపెట్టి తాను ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం వరకు పనులు పూర్తి చేయించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రాణహిత–చేవెళ్లలకు అనుమతులు తెచ్చి రాష్ట్రానికే వరమైన కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి రూపకల్పన చేసిన మహోన్నతమైన వ్యక్తి వైయస్‌ఆర్‌.  మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌న మ‌ధ్య భౌతికంగా లేక‌పోయినాఆయ‌న చేసిన అభివృద్ధి, సంక్షేమ పాల‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆయ‌న్ను మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నేత అని తెలుగు ప్ర‌జ‌లు కీర్తిస్తుంటారు. రేపు మ‌హానేత 75వ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు.  

The rise of YSR – A profile | Political Pulse News - The Indian Express

Back to Top